2019 లోనే సత్తా తేలిపోయింది,2024లో కొత్తగా ఏం చేస్తాడు: పవన్‌కి బొత్స కౌంటర్

By narsimha lode  |  First Published Nov 27, 2022, 3:42 PM IST

2019లోనే  పవన్  కళ్యాణ్  సత్తా చూశామని  ఏపీ  మంత్రి బొత్స  సత్యనారాయణ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో  కొత్తగా  పవన్  కళ్యాణ్  ఏం  చేయగలడో  చెప్పాలని  ఆయన ప్రశ్నించారు.



అమరావతి: పిట్టకొంచెం  కూత ఘనం  అన్న చందంగా  జనసేన చీఫ్ పవన్  కళ్యాణ్  వ్యాఖ్యలున్నాయని ఏపీ మంత్రి  బొత్స  సత్యనారాయణ చెప్పారు. జనసేన చీఫ్  పవన్ కళ్యాణ్  వ్యాఖ్యలపై  ఏపీ మంత్రి  బొత్స  సత్యనారాయణ  ఆదివారం నాడు  కౌంటరిచ్చారు.ఇవాళ  ఇప్పటంలో  ఇళ్లు  కోల్పోయిన  బాధితులకు  పవన్  కళ్యాణ్ ఆర్ధిక  సహాయం అందించారు.ఈ సందర్భంగా  నిర్వహించిన  కార్యక్రమంలో  వైసీపీపై  సీరియస్  వ్యాఖ్యలు  చేశారు. 

2024  ఎన్నికల్లో  రాష్ట్రంలో  వైసీపీ  ఎలా  గెలుస్తుందో  చూస్తానని  పవన్ కళ్యాణ్  చెప్పారు.  175  సీట్లలో  వైసీపీ  గెలుస్తుంటే  తాము నోట్లో  వేలు పెట్టుకొని చూస్తామా  అని  పవన్  కళ్యాణ్  చేసిన  వ్యాఖ్యలపై  మంత్రి  స్పందించారు.ఇప్పటంలో  అభివృద్ది  కోసం రోడ్లు  విస్తరిస్తుంటే  పవన్  కు అభ్యంతరం  ఏమిటని ఆయన  ప్రశ్నించారు.2019 ఎన్నికల్లో  పవన్ కళ్యాణ్  సత్తా  ఏమిటో  అర్ధమైందన్నారు. 2009లో అన్న  ప్రజారాజ్యం పార్టీలో  పవన్  కళ్యాణ్ ఏం చేశారో చూశామన్నారు.ఇప్పుడు  కొత్తగా  పవన్ కళ్యాణ్  ఏం చేయగలరని  ఆయన ప్రశ్నించారు.

Latest Videos

undefined

2014  ఎన్నికల  సమయంలో పవన్ కళ్యాణ్  జనసేన పార్టీని ఏర్పాటు  చేశారు. ఆ  ఎన్నికల  సమయంలో  టీడీపీ, బీజేపీ కూటమికి పవన్ కళ్యాణ్  మద్దతిచ్చారు. ఆ  తర్వాత  చోటు  చేసుకున్న రాజకీయ పరిణామాల  నేపథ్యంలో  పవన్  కళ్యాణ్  టీడీపీకి  దూరమయ్యారు. 2019  ఎన్నికల  సమయంలో  లెఫ్ట్  పార్టీలతో  కలిసి పవన్  కళ్యాణ్  పోటీ చేశారు.  ఈ  ఎన్నికల్లో  పవన్ కళ్యాణ్  పోటీ  చేసిన  రెండు  స్తానాల్లో  ఓటమి పాలయ్యాడు.  కానీ  జనసేన అభ్యర్ధిగా  పోటీ  చేసిన  రాపాక  వరప్రసాద్  విజయం  సాధించారు. రాపాక  వర ప్రసాద్  వైసీపీకి జై కొట్టారు.

also read:నా యుద్ధం నేనే చేస్తా, మమ్మల్ని బెదిరిస్తే ఏం చేస్తామో చూపిస్తాం: వైసీపీకి పవన్ వార్నింగ్

2019  ఎన్నికల  తర్వాత  లెఫ్ట్  పార్టీలతో  దోస్తీకి పవన్ కళ్యాణ్ గుడ్ బై  చెప్పారు.  బీజేపీతో  పవన్  కళ్యాణ్  మైత్రిని  ప్రారంభించారు.  వచ్చే  రెండేళ్లలో  ఏపీలో  అసెంబ్లీ  ఎన్నికలు జరగనున్నాయి. ఈ  తరుణంలో  రాష్ట్రంలో  ఎన్నికల  వేడి  రాజుకుంది.  ఈ  తరుణంలో  పవన్  కళ్యాణ్  వైసీపీపై  విమర్శలు  గుప్పించారు. 
 

click me!