చట్టం తనపని తాను చేసుకుపోతుందని మాజీ మంత్రి నారాయణపై ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పంందించారు.
అమరావతి: ఏపీలో టెన్త్ క్లాస్ పేపర్స్ లీకేజీ కేసులోనే మాజీ మంత్రి పి. నారాయణను అరెస్ట్ చేసినట్టుగా ఏపీ విద్యాశాఖ మంత్రి Botsa Satyanarayana ప్రకటించారు.
మంగళవారం నాడు తాడేపల్లిలో ఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. పేపర్ Leakage విషయంలో నారాయణ పాత్ర ఉందా లేదా అనే విషయాన్ని పోలీసులు దర్యాప్తులో తేల్చనున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. పేపర్ లీకేజీ కేసులో ఇప్పటికే 60 మందిని అరెస్ట్ చేశామని మంత్రి గుర్తు చేశారు. అరెస్టైన వారిలో ప్రభుత్వ టీచర్లు కూడా ఉన్నారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
Ponguru Narayanana ను టెన్త్ పేపర్ లీకేజీ కేసులోనే నారాయణను అరెస్ట్ చేశారని మంత్రి తెలిపారు. టెన్త్ క్లాస్ పేపర్ లీకేజీపై దర్యాప్తు జరుగుతుందని మంత్రి చెప్పారు.వేరే కేసు గురించి తనకు తెలియదన్నారు.పేపర్ లీకేజీ అయిందా లేదా అనే విషయాన్ని స్పష్టం చేయాలన్నారు.
రాజకీయ కోణంలోనే అరెస్ట్ చేశారని టీడీపీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ ఖండించారు. రాజకీయాల్లో ఉన్నవారు తప్పులు చేయవచ్చా అని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగంలో ఈ మేరకు రాజకీయ నేతలకు ఏమైనా వెసులుబాటు కల్పించారా అని కూడా ఆయన ప్రశ్నించారు.Amaravathi ల్యాండ్ పూలింగ్ లో అవినీతి జరగకపోతే కేసు ఎందుకు పెడతారని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.