కోనసీమకు అంబేద్కర్ పేరును పెడితే రాజకీయాలు చేస్తారా?: విపక్షాలపై మంత్రి బొత్స ఫైర్

By narsimha lode  |  First Published May 26, 2022, 4:37 PM IST


కోనసీమ జిల్లాకు డాక్టర్ అంబేద్కర్ పేరు పెడితే రాజకీయాలు చేయడం దుర్మార్గమని ఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.


అమరావతి: konaseema జిల్లాకు డాక్టర్ అంబేద్కర్ పేరును పెడితే రాజకీయాలు చేయడం దుర్మార్గమని ఏపీ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.గురువారం నాడు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఓ తెలుగు న్యూస్ చానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు.  దెబ్బలు తగులుతున్న కూడా పోలీసులు ఆందోళనకారులకు ఎలాంటి హాని కల్గించలేదన్నారు. ప్రజలకు హాని కల్గించడం ఏ రకంగా ప్రభుత్వ వైఫల్యం అవుతుందని Botsa Satyanarayana ప్రశ్నించారు.

ప్రజలకు దెబ్బలు తగిలి కాల్పుల్లో చనిపోతే బాగుండేదన్నది ప్రతిపక్షాల ఉద్దేశమన్నారు.అందరూ అడిగినందుకే  కోనసీమ జిల్లాకు డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు పెట్టామని బొత్స సత్యనారాయణ చెప్పారు. రాజకీయ పార్టీలు ఇలాంటివి ప్రోత్సహించడం కరెక్టు కాదన్నారు.

Latest Videos

క్విట్ చంద్రబాబు, క్విట్ టీడీపీ అంటేనే బాగుంటుందన్నారు.పెట్టుబడిదారులకే చంద్రబాబునాయుడు రాజ్యసభ సీట్లిచ్చారని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఇంత కాలం పాటు ఏపీకి సీఎంగా పినచేసిన చంద్రబాబు తన హయంలో ఏం సాధించారో చెప్పాలన్నారు.తాను ప్రవేశ పెట్టిన పథకాలు ఏమిటో చెప్పాలని మంత్రి బొత్స సవాల్ చేశారు.

చంద్రబాబు అధికారంలో ఉంటే అయితే అతివృష్టి, అనావృష్టి వచ్చేదని సెటైర్లు వేశారు. కాపు ఉద్యమాన్ని కించపరుస్తూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

also read:వాళ్ల ఇళ్లు వాళ్లే తగులబెట్టుకుని, అంతా పోలీసుల ఎదుటే.. కోనసీమ అల్లర్లు వైసీపీ పనే : చంద్రబాబు వ్యాఖ్యలు

కోనసీమ జిల్ల పేరును కొనసాగించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ముట్టడి ఈ నెల 24న టెన్షన్ కు దారి తీసింది. జేఎసీ నేతలతో పాటు ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. అయితే క్రమంలో పోలీసులు, ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆందోళనకారులను కలెక్టరేట్ వైపునకు వెళ్లకుండా పోలీసులు నియంత్రించే ప్రయత్నం చేశారు. దీంతో ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. ఎస్పీ సుబ్బారెడ్డి వాహనంపై రాళ్ల దాడికి దిగారు.  ఎస్పీ గన్ మెన్లు,  డీఎస్పీకి గాయాలయ్యాయి. మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇంటికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు.  సాయంత్రం నుండి రాత్రి 9 గంటల వరకు ఆందోళనకారులను అదుపు చేయడానికి పోలీసులు కష్టపడ్డారు.. ఇతర జిల్లాల నుండి అదనపు బలగాలు వచ్చిన తర్వాతే అమలాపురంలో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

అమలాపురంలో విధంసానికి పాల్పడిన వారిలో 70 మందిని గుర్తించారు పోలీసులు. వీరిలో ఇప్పటికే 42 మందిని అరెస్ట్ చేశారు. మిగిలిన వారిని కూడా అదుపులోకి తీసుకొనే ప్రయత్నం చేస్తున్నారు.  ఈ విధ్వంసానికి కారణం మీరంటే మీరని అధికార విపక్షాలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి

click me!