ఆస్తుల జప్తు ఇవాళ కొత్తగా వచ్చిన అంశం కాదు.. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ

Published : Mar 21, 2022, 12:57 PM IST
ఆస్తుల జప్తు ఇవాళ కొత్తగా వచ్చిన అంశం కాదు.. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ

సారాంశం

రాష్ట్రంలో ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఉండాలనేది ప్రభుత్వ విధానమని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (botsa satyanarayana) చెప్పారు. ప్రజలు అధికారికంగా కుళాయి కనెక్షన్లు తీసుకోవాలని సూచించారు. 

రాష్ట్రంలో ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఉండాలనేది ప్రభుత్వ విధానమని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (botsa satyanarayana) చెప్పారు. ప్రజలు అధికారికంగా కుళాయి కనెక్షన్లు తీసుకోవాలని సూచించారు. అనధికారికంగా జరిగే సంఘటనకు ఈనాడు మద్దుతు పలుకుతుందా అని ప్రశ్నించారు. సోమవారం బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలను గందరగోళఝ పరిచే విధంగా మీడియా వ్యవహరించకూడదని అన్నారు. పన్నులు కట్టకపోతే ఆస్తులు జప్తు చేయడమనేది ఎప్పటి నుంచో ఉన్నదేనని బొత్స స్పష్టం చేశారు. 

ప్రజలను ఇబ్బంది పెట్టి జప్తు చేయడం ప్రభుత్వ ఉద్దేశం కాదని బొత్స సత్యనారాయణ చెప్పారు. స్థానిక సంస్థలు సక్రమంగా నిర్వహించాలంటే ప్రజలు పన్నులు సక్రమంగా చెల్లించాలన్నారు. ఆస్తి పన్ను వసూలు కోసం ఇంటి ముందు బ్యానర్ కడితే తప్పేముందని ప్రశ్నించారు. బలవంతపు పన్ను వసూలు చేయాలని ప్రభుత్వం ఎక్కడా ఆదేశించలేదని చెప్పారు. 

అధికారికంగా కుళాయి కనెక్షన్లు తీసుకోవడం అనేది ప్రజలు హక్కుగా భావించాలని మంత్రి బొత్స అన్నారు. ఆస్తుల జప్తు ఇవాళ కొత్తగా వచ్చిన అంశం కాదని.. పన్నులు కట్టకుంటే ఆస్తులు జప్తులు చేస్తామనడం తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. గత ప్రభుత్వాలు చేసినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని అన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Deputy CM Pawan Kalyan: కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ సమావేశంలో పవన్ కీలక ప్రసంగం | Asianet News Telugu
CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu