మూడు నెలల్లో విశాఖపట్టణం ఎగ్జిక్యూటివ్ కేపిటల్: విజయనగరంలో మంత్రి బొత్స సత్యనారాయణ

By narsimha lodeFirst Published Jan 1, 2023, 5:14 PM IST
Highlights

కొత్త సంవత్సరంలో  విశాఖపట్టణం నుండి   సీఎం జగన్  పాలన సాగించనున్నారని  ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. 

విజయనగరం: రానున్న మూడు నెలల్లో విశాఖపట్టణం ఎగ్జిక్యూటివ్  రాజధానిగా మారనుందని  ఏపీ  రాష్ట్ర మంత్రి  బొత్స సత్యనారాయణ చెప్పారు.కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ  ఆదివారం నాడు  విజయనగరంలో  ఆయన మాట్లాడారు. ఈ ఏడాదిలో విశాఖపట్టణంనుండి  సీఎం జగన్ పాలన కొనసాగిస్తాడని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  వైసీపీ అధికారంలోకి వచ్చిన  తర్వాత మూడు రాజధానుల అంశం తెరమీదికి వచ్చింది.అమరావతిని శాసన రాజధానిగా , కర్నూల్ ను  న్యాయ రాజధానిగా , విశాఖప్టణాన్ని పరిపాలన రాజధానిగా  ఏర్పాటు చేస్తామని  ఏపీ సీఎం జగన్ ప్రకటించారు.   మూడు రాజధానులను విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. 2014లో  ఏపీ సీఎంగా  ఉన్న చంద్రబాబునాయుడు అమరావతిలో రాజధానిని ఏర్పాటు చేశారు. అమరావతి రాజధానిని  వైసీపీ  కూడా  అంగీకరించిందని  విపక్షాలు గుర్తు చేస్తున్నాయి. 

మూడురాజధానులకు వ్యతిరేకంగా  ఏపీ హైకోర్టులో  అమరావతి రైతులు సహా,  పలు రాజకీయ పార్టీలు  కోర్టులో  పిటిషన్లు దాఖలు చేశాయి.  ఈ పిటిషన్లపై విచారణ నిర్వహించిన ఏపీ హైకోర్టు  మూడు రాజధానుల విషయమై కీలక తీర్పును ఇచ్చింది. ఈ తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.  ఏపీ  హైకోర్టు తీుర్పుసై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది.  మరో వైపు అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అమరావతి రైతులు కూడా  రాజధాని ఇక్కడే ఉంచాలని కోరుతున్నారు.  ఈ తరుణంలో ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు  ప్రాధాన్యత సంతరించుకొన్నాయి. 

click me!