హిందూ ఆలయాలపై దాడులు.. ఒక్క దోషి కూడా దొరికింది లేదు :జగన్‌పై కళా వెంకట్రావు ఆగ్రహం

Siva Kodati |  
Published : Jan 01, 2023, 04:56 PM ISTUpdated : Jan 01, 2023, 04:57 PM IST
హిందూ ఆలయాలపై దాడులు.. ఒక్క దోషి కూడా దొరికింది లేదు :జగన్‌పై కళా వెంకట్రావు ఆగ్రహం

సారాంశం

జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలోని హిందూ దేవాలయాలు, విగ్రహాలపై దాడులు జరిగాయన్నారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కళా వెంకట్రావు. ఇప్పటిదాకా ఏ ఒక్క సంఘటనలోనూ దోషులను పట్టుకోలేదని దుయ్యబట్టారు. 

జగన్ పాలనపై మండిపడ్డారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కళా వెంకట్రావు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో హిందువుల మనోభావాలను దెబ్బతీసే కుట్ర జరుగుతోందన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా 285 దేవాలయాలు, దేవుళ్ల విగ్రహాలపై దాడులు జరిగాయని కళా వెంకట్రావు ఆరోపించారు. గత మూడున్నరేళ్లుగా వరుసగా జరుగుతున్న సంఘటనలే అందుకు నిదర్శనమని... ఇప్పటిదాకా ఏ ఒక్క సంఘటనలోనూ దోషులను పట్టుకోలేదని దుయ్యబట్టారు. 

ఇకపోతే.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శనివారం నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛ కోల్పోయి ఆర్థికంగా మానసిక క్షోభను అనుభవిస్తున్నారని అన్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే.. శారీరక వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. పోలీసులతో కేసులు పెట్టించి ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రం గంజాయి హబ్‌గా మారిపోయిందని ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కూడా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.కందుకూరు ఘటనలో తనపై కూడా కేసులు పెట్టే ప్రయత్నం చేశారని చెప్పారు. సీఎం జగన్ బాబాయి వైఎస్ వివేకానందర్ రెడ్డిని చంపిన  వ్యక్తిపై ఎటువంటి  చర్యలు లేవని విమర్శించారు. 

ALso REad: వైసీపీలో అంతర్యుద్దం.. ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు ఇంకా పెరుగుతుంది: చంద్రబాబు

వైసీపీ ప్రభుత్వం రానురాను తిరుగుబాటు ఇంకా ఇంకా పెరుగుతుందని చంద్రబాబు అన్నారు.మనకెందుకని పోరాటం చేయకపోతే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుందని కామెంట్ చేశారు. వైసీపీ ప్రభుత్వంపై పోరాటానికి ప్రజలూ ముందుకు రావాలని పిలుపిచ్చారు.రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ఒకవైపు ఉంటే..జగన్ ఒక్కడే ఒక వైపు ఉన్నారని.. ఇప్పటికే యుద్ధం మొదలైందని చంద్రబాబు పేర్కొన్నారు.సీఎం జగన్ సైకో పాలనతో అన్ని వ్యవస్థలను విధ్వంసం చేసేశారని చంద్రబాబు మండిపడ్డారు.2023 పెనుమార్పులకు వేదిక కానుందని అన్నారు. వైసీపీలో కూడా అంతర్యుద్దం మొదలైందని అన్నారు.రాష్ట్రంపై గౌరవం ఉండేవారు ఆ పార్టీలో ఉండరని చెప్పుకొచ్చారు.వైసీపీ పాలనలో స్థానిక సంస్థలను నిర్విర్యం చేశారని.. జగన్‌కు ఓటమి భయం పట్టుకుందని చంద్రబాబు విమర్శించారు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం... ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు
Vizag Police Commissioner: తాగి రోడ్డెక్కితే జైలుకే విశాఖ పోలీస్ హెచ్చరిక | Asianet News Telugu