చిత్తూరులో కరోనా ఉధృతి:ఏపీలో మొత్తం కేసులు 20,13,001కి చేరిక

Published : Aug 30, 2021, 06:12 PM ISTUpdated : Aug 30, 2021, 10:54 PM IST
చిత్తూరులో కరోనా ఉధృతి:ఏపీలో మొత్తం కేసులు 20,13,001కి చేరిక

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది., కొన్ని జిల్లాల్లో కరోనా వ్యాప్తి  తగ్గడం లేదు. మరికొన్ని జిల్లాల్లో కరోనా వ్యాప్తి తగ్గింది. గత 24 గంటల్లో 878 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 20,13,001 కి చేరుకొన్నాయి.

అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కానీ కొన్ని జిల్లాల్లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతూనే ఉంది.గత 24 గంటల్లో41,173మంది శాంపిల్స్ ను పరీక్షిస్తే 878మందికి కరోనా నిర్ధారణ అయింది.  రాష్ట్రంలో కరోనా కేసులు 20,13,001 కి చేరుకొన్నాయి.నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 13 మంది మృత్యువాతపడ్డారు. దీంతో  రాష్ట్రంలో మొత్తం  కరోనా మరణాల సంఖ్య 13,838 కి చేరింది. 

గడిచిన 24 గంటల్లో 1182 మంది కోవిడ్‌ నుంచి కోలుకొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుండి 19 లక్షల 84వేల 301 మంది కోలుకొన్నారు. ఏపీలో ప్రస్తుతం 14,862 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 2,65,76,995 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. 

గత 24 గంటల్లో అనంతపురంలో002,చిత్తూరులో 255, తూర్పుగోదావరిలో166,గుంటూరులో085,కడపలో 067, కృష్ణాలో042, కర్నూల్ లో003, నెల్లూరులో061, ప్రకాశంలో 096,విశాఖపట్టణంలో 050,శ్రీకాకుళంలో024, విజయనగరంలో 004,పశ్చిమగోదావరిలో 023 కేసులు నమోదయ్యాయి.


గత 24 గంటల్లో కరోనాతో  13 మంది చనిపోయారు.కృష్ణా జిల్లాలో నలుగురు, చిత్తూరులో ముగ్గురు, తూర్పు గోదావరి, గుంటూరు, కడప,ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్కరి చొప్పున కరోనాతో చనిపోయారు.దీంతో రాష్ట్రంలో  కరోనాతో మరణించిన వారి సంఖ్య 13,838కి చేరుకొంది.

 
ఏపీలో పలు జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం-1,57,105, మరణాలు 1091
చిత్తూరు-2,37,957, మరణాలు1843
తూర్పుగోదావరి-2,85,590, మరణాలు 1257
గుంటూరు -1,72,382,మరణాలు 1181
కడప -1,12,582, మరణాలు 630
కృష్ణా -1,13,591,మరణాలు 1307
కర్నూల్ - 1,23,775,మరణాలు 849
నెల్లూరు -1,40,030,మరణాలు 1002
ప్రకాశం -1,33,540, మరణాలు 1047
శ్రీకాకుళం-1,21,982, మరణాలు 778
విశాఖపట్టణం -1,54,893, మరణాలు 1104
విజయనగరం -82,408, మరణాలు 669
పశ్చిమగోదావరి-1,74,271, మరణాలు 1080
 

 

PREV
click me!

Recommended Stories

Scrub Typhus : తెలుగు రాష్ట్రాల్లో కొత్త వ్యాధి.. ఏమిటిది, ఎలా సోకుతుంది, లక్షణాలేంటి?
Vegetables Price : వీకెండ్ మార్కెట్స్ లో ఏ కూరగాయ ధర ఎంత..?