పార్టీ మారుతారని గంటాపై ప్రచారం: మంత్రి అవంతి సంచలన వ్యాఖ్యలు

Published : Aug 04, 2020, 03:55 PM IST
పార్టీ మారుతారని గంటాపై ప్రచారం: మంత్రి అవంతి సంచలన వ్యాఖ్యలు

సారాంశం

తనపై ఉన్న కేసులను మాఫీ చేసుకోవడానికే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు  వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాసరావు విమర్శించారు.


విశాఖపట్టణం: తనపై ఉన్న కేసులను మాఫీ చేసుకోవడానికే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు  వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాసరావు విమర్శించారు.

అధికారం ఎక్కడ ఉంటే గంటా అక్కడ ఉంటారన్నారని ఆయన ఆరోపించారు. అధికారం లేకపోతే గంటా శ్రీనివాసరావు ఉండలేరని విమర్శించారు. తనపై ఉన్న కేసుల నుంచి తప్పించుకోనేందుకు దొడ్డుదారిన వైసీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.

 సైకిళ్ళ కుంభకోణం, భూ కుంభకోణాల్లో గంటాతో పాటు ఆయన అనుచరులు ఉన్నారని మంత్రి ఆరోపించారు. ఇదే విషయాన్ని విజయసాయిరెడ్డికి తెలియజేశానన్నారు. గంటాపై ఆయన ప్రభుత్వంలో ఉన్నఓ మంత్రే ఫిర్యాదు చేశారని ఆయన గుర్తు చేశారు.ఇవన్నీ లీక్స్ అని తాను అనుకుంటున్నానని మంత్రి అవంతి అభిప్రాయపడ్డారు. 

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ నెల 16వ తేదీన టీడీపీ నుండి వైసీపీలో చేరే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. చాలా కాలంగా గంటా శ్రీనివాసరావు టీడీపీని వీడుతారని ప్రచారం సాగుతోంది. అయితే పార్టీ మారే విషయంలో గంటా శ్రీనివాసరావు మాత్రం నోరు మెదపడం లేదు. తాజాగా సాగుతున్న ప్రచారం నేపథ్యంలో 
 

PREV
click me!

Recommended Stories

Bus Accident : అల్లూరి జిల్లాలో ఘోరం.. బస్సు ప్రమాదంలో 15మంది మృతి
IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!