కేబినెట్‌లో మార్పులపై ఊహగాహనాలు: అప్పలరాజుకు జగన్ నుండి పిలుపు

By narsimha lode  |  First Published Mar 31, 2023, 12:05 PM IST

మంత్రి అప్పలరాజుకు  ఏపీ సీఎం జగన్  నుండి  పిలుపు వచ్చింది. దీంతో   మంత్రి అప్పలరాజు  తాడేపల్లికి బయలుదేరారు.


అమరావతి: మంత్రి అప్పలరాజుకు  సీఎం వైఎస్ జగన్ నుండి  శుక్రవారంనాడు  పిలుపు వచ్చింది. తన కార్యక్రమాలను రద్దు  చేసుకొని  మంత్రి అప్పలరాజు  తాడేపల్లికి బయలుదేరారు.  పలాసలో  ఉన్న మంత్రి అప్పలరాజుకు   సీఎం  జగన్ నుండి పిలుపు రావడంతో  హుటాహుటిన  ఆయన తాడేపల్లికి బయలుదేరారు. 

మంత్రి అప్పలరాజును  సీఎం జగన్  పిలుపుపై  రాజకీయవర్గాల్లో  చర్చ సాగుతుంది.  ఏపీ కేబినెట్ లో  మార్పులు  చేర్పులు జరిగే  అవకాశం ఉందనే  ప్రచారం సాగుతుంది.  ఈ తరుణంలో  మంత్రి అప్పలరాజును సీఎం జగన్ పిలిపించడం ప్రాధాన్యత  సంతరించుకుంది.  శాఖపరమైన  పనుల విషయమై  చర్చించేందుకు  మంత్రి అప్పలరాజును పిలిచారా, మంత్రివర్గ విస్తరణ విషయమై  చర్చించేందుకు  పిలిచారా  అనే విషయమై  సర్వత్రా చర్చ సాగుతుంది. 

Latest Videos

undefined

కడపలో  పశుసంవర్ధక శాఖ ఉద్యోగి అచ్చెన్న  హత్య  విషయమై  చర్చించేందుకు  సీఎం మంత్రి అప్పలరాజును పిలిచి ఉంటారనే  ప్రచారం కూడా  లేకపోలేదు.  సీఎం  జగన్   నుండి  ఫోన్ రావడంతో  నియోజకవర్గంలో కార్యక్రమాలను మంత్రి  అప్పలరాజు రద్దు  చేసుకున్నారు.  

వచ్చే ఏడాదిలో  ఏపీలో  అసెంబ్లీ ఎన్నికలు  జరగనున్నాయి.ఈ ఎన్నికల్లో  మరోసారి అధికారాన్ని కైవసం చేసుకోవాలని  జగన్  పట్టుదలగా  ఉన్నారు.  అయితే  ఎన్నికలకు  తన జట్టును సిద్దం  చేసుకొంటున్నారు.  ప్రస్తుత మంత్రివర్గంలో  కొందరి పనితీరుపై  సీఎం జగన్  అసంతృప్తితో  ఉన్నారు.  మీ పనితీరును గమనిస్తున్నానని  జగన్  చెప్పారు. ీ నెల  14న జరిగిన   కేబినెట్ సమావేశంలో  సీఎం జగన్  ఈ వ్యాఖ్యలు  చేశారు.  

పనితీరు  సరిగా లేని  మంత్రులను  కేబినెట్ నుండి తప్పిస్తానని  జగన్  వార్నింగ్  ఇచ్చారు.   ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా  పూర్తయ్యాయి.  కొత్తగా  ఎమ్మెల్సీలుగా  ఎన్నికైనవారికి మంత్రివర్గంలో  చోటు  దక్కే అవకాశం లేకపోలేదనే  ప్రచారం సాగుతుంది. సామాజిక సమతుల్యతతో పాటు  పార్టీ అవసరాల దృష్ట్యా కేబినెట్ లో మార్పులు చేర్పులు  చేయాలని  జగన్ భావిస్తున్నారని  సమాచారం.

మంత్రివర్గంలో మార్పులపై ఊహగానాలు: రాఘవేంద్రస్వామిని దర్శించుకున్న జయరాంalso read:

అయితే  కేబినెట్ లో మార్పులు చేర్పులు  ఎప్పుడనే విషయమై  ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. వచ్చే ఎన్నికలకు  పార్టీని  సన్నద్దం  చేయడంతో   ప్రజలకు  సమర్ధవంతంగా పాలన అందించేందుకు  కేబినెట్ లో  సమర్ధులు  ఉండాలని  జగన్  కోరుకుంటున్నారు. ఈ దిశగానే  కేబినెట్ లో మార్పులు  చేర్పులు  ఉండే అవకాశం ఉందని  ప్రచారం సాగుతుంది.   కేబినెట్ లో  మార్పుల విషయమై  ఇటీవల జరిగిన  కేబినెట్ సమావేశంలో  జగన్  మంత్రులకు  వార్నింగ్  ఇచ్చారు.

click me!