
సత్తెనపల్లి: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ భీమవరంలో పిచ్చికుక్కలాగా స్వైర విహారం చేశారని అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీ మంత్రి అంబటి రాంబాబు శనివారంనాడు గుంటూరులో మీడియాతో మాట్లాడారు. భీమవరంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ ను, వైసీపీని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి అంబటి రాంబాబు కౌంటరిచ్చారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ గురించి ఏం తెలుసునని ఆయన ప్రశ్నించారు. జగన్ ఎక్కడ చదువుకున్నాడు, ఏం చేశాడనే విషయాల గురించి తెలిస్తే పుస్తకం రాయాలని మంత్రి అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ కు సలహా ఇచ్చారు.
పవన్ కళ్యాణ్ మాత్రం అందరినీ తిట్టొచ్చు.. వైసీపీ వాళ్లు మాత్రం మాట్లాడకూడదా అని ఆయన ప్రశ్నించారు. నా కొడకల్లారా అనే పదాన్ని ఉపయోగించిన పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో చీడపురుగుగా ఆయన పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడే బూతులన్నీ పాలసీయేనా అని ఆయన ప్రశ్నించారు.భీమవరంలో పవన్ కళ్యాణ్ మాట్లాడింది చూస్తే రౌడీ మాట్లాడినట్టుగా ఉందన్నారు.
తనకు ప్రధాని మోడీ, అమిత్ షా తెలుసునని పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రకటనల గురించి అంబటి రాంబాబు స్పందించారు. దేశాధినేతలు తెలిస్తే మమ్మల్ని ఏం చేస్తావని ఆయన ప్రశ్నించారు. తాము ప్రజల ఓట్లతో ఎన్నికైనవారమనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ కు హితవు పలికారు. పోటీ చేసిన రెండు చోట్ల పవన్ కళ్యాణ్ ఓటమి పాలయ్యాడని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.
చంద్రబాబు సీఎం కావాలనే లక్ష్యంతోనే పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. బాగా ఊగిపోతే పోరాటమా అని ఆయన ప్రశ్నించారు. పిరికివాడే ఊగిపోతూ మాట్లాడుతారని అంబటి రాంబాబు అభిప్రాయపడ్డారు.
వచ్చే ఎన్నికల్లో పేదలకు , పెత్తందార్లకు మధ్య యుద్ధంగా మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు.ఈ ఎన్నికల్లో పెత్తందార్ల పక్షాన పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారన్నారు. అధికారాన్ని చంద్రబాబుకు అప్పగించి డబ్బును పవన్ కళ్యాణ్ తీసుకుంటారని అంబటి రాంబాబు ఆరోపించారు. పవన్ కళ్యాణ్ కులాన్ని అమ్మే ప్రయత్నం చేస్తున్నారన్నారు.