పోలవరంతో భద్రాచలానికి ముప్పు లేదు: పువ్వాడ వ్యాఖ్యలకు అంబటి కౌంటర్

By narsimha lode  |  First Published Jul 19, 2022, 1:53 PM IST


పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలానికి ఎలాంటి ముప్పు లేదని ఏపీ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేస్తున్న డిమాండ్ లో అర్ధం లేదన్నారు. 


అమరావతి: Polavaram ప్రాజెక్టుతో భద్రాచలానికి ఎలాంటి ముప్పు లేదని ఏపీ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి Ambati Rambabu  చెప్పారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించాలని తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సహా ఖమ్మం జల్లాకు చెందిన TRS ఎమ్మెల్యేలు మంగళవారం నాడు డిమాండ్ చేశారు. 

Bhadrachalam,కి సమీపంలోని ఐదు గ్రామాలను Telangana లో కలపాలని కూడా టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు కోరారు. అంతేకాదు పోలవరం ప్రాజెక్టు ఎత్తు పెంపు వల్ల భద్రాచలం పట్టణానికి వరద ముంపు పొంచి ఉందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సహా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. 
అయితే ఈ విషయమై ఏపీ నీటిపారుల శాఖ  మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ఓ ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ తో  అంబటి రాంబాబు మాట్లాడారు.  Godavari River కి వరదలు వచ్చినప్పుడల్లా కొత్త వివాదాలు తీసుకు రావడం సరైంది కాదన్నారు. పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలం పట్టణానికి ఎలాంటి ముప్పు లేదని ఆయన తేల్చి చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చే సమయంలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని కేంద్రం అనుమతులు మంజూరు చేసిన విషయాన్ని ఏపీ మంత్రి అంబటి రాంబాబు గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్ వాటర్ కమిషన్ సహా అన్ని రకాల ప్రభుత్వ శాఖల అనుమతులు వచ్చిన తర్వాతే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన విషయాన్ని అంబటి రాంబాబు గుర్తు చేశారు. 

Latest Videos

undefined

 పోలవరం ప్రాజెక్టులో 45.72 అడుగుల వరకు నీటిని నిలుపుకోవచ్చని కేంద్రం అనుమతిని ఇచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. గోదావరికి ఇవాళ కొత్తగా వచ్చిన వరద కాదని ఆయన గుర్తు చేశారు. ఈ విషయమై కేంద్రంతోనో, సెంట్రల్ వాటర్ కమిషన్ తోనో తేల్చుకోవాలని ఏపీ మంత్రి అంబటి రాంబాబు తెలంగాణకు సూచించారు. ఏ కాంటూరు లెవల్ లో  ఏ గ్రామం ముంపునకు గురౌతుందో గుర్తించి పరిహారం చెల్లించిన విషయాన్ని కూడా అంబటి రాంబాబు గుర్తు చేశారు. 

పోలవరం ప్రాజెక్టు గేట్లు ఆలస్యంగా ఎత్తడం వల్లే భద్రాచలం పట్టణంలో ముంపు పెరిగిందని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆరోపించారు. ఈ వాదనను ఏపీ మంత్రి అంబటి రాంబాబు కొట్టి పారేశారు. తమ అభ్యంతరాలపై సెంట్రల్ వాటర్ కమిషన్ వద్ద తేల్చుకోవాలని మంత్రి అంబటి రాంబాబు తెలంగాణను కోరారు. ప్రాజెక్టు పూర్తయ్యే తరుణంలో ఎత్తు పెంపును తగ్గించాలనే వాదన తీసుకురావడం అర్ధం లేదని అంబటి రాంబాబు అభిప్రాయపడ్డారు. 

also read:పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలానికి ముప్పు పొంచి ఉంది: మంత్రి పువ్వాడ అజయ్

గోదావరి నదికి ఎప్పుడూ లేనంతగా వరద వచ్చింది. దీంతో భద్రాచలం వద్ద గోదావరి 70 అడుగులను దాటి ప్రవహించింది. దీంతో భద్రాచలంతో పాటు గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరో వైపు పోలవరం ప్రాజెక్టులో 40 అడుగుల మేర నీటిని నిల్వ ఉంచడంతో టెంపుల్ సిటీ భద్రాచలానికి ప్రమాదం ఉందని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెబుతున్నారు. 

click me!