ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వం EAPCET షెడ్యూల్ ను విడుదల చేసింది. ఈ ఏడాది జూలై మాసంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంసెట్ (EAPCET)షెడ్యూల్ ను బుధవారం నాడు విడుదల చేసింది.గత ఏడాది నుండి ఎంసెట్ ను ఏపీ ప్రభుత్వం EAPCETగా మార్చిన విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం మంగళవారం నాడే ఎంసెట్ షెడ్యూల్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఇవాళ ఏపీ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి Adimulapu Suresh ఏపీ ఈఏపీసెట్ షెడ్యూల్ ను విడుదల చేశారు.
ఈ ఏడాది జూలై 4 నుండి 8వ తేదీ వరకు engineering పరక్షలు నిర్వహించనున్నారు.జూలై 11,12 తేదీల్లో Agriculture పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్ర వయాప్తంగా 134 సెంటర్లలో పరీక్షలు నిర్వహిస్తారు. తెలంగాణలో కూడా నాలుగు పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 11న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
undefined
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా నిన్ననే ఎంసెట్ ప్రవేశ పరీక్షలను విడుదల చేసింది. ఐఐటీ జేఇఇ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఆధారంగా రెండు తెలుగు రాష్ట్రాలు తమ రాష్ట్రాల్లో ఎంసెట్ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేశారు.
ఐఐటీ జేఇఇ ప్రవేశ పరీక్షల షెడ్యూల్స్ మార్పులు చేయడంతో ఏపీ, తెలంగాన రాష్ట్రాలకు చెందిన ఇంటర్, టెన్త్ పరీక్షల షెడ్యూల్స్ లో కూడా రెండు రాష్ట్రాలు మార్పులు చేర్పులు చేశాయి. కొత్త షెడ్యూళ్లను రెండు రాష్ట్రాలు గత వారంలోనే ప్రకటించాయి.