దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నాయి: రాజ్యాంగంపై కేసీఆర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి సురేష్

By narsimha lode  |  First Published Feb 4, 2022, 3:03 PM IST

రాజ్యాంగంపై తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు.ఈ వ్యాఖ్యలు దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నాయన్నారు
 



అమరావతి: రాజ్యాంగంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నాయని ఏపీ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి  Adimulapu Suresh చెప్పారు.శుక్రవారం నాడు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. కొందరు కుహనా మేధావులు రాజ్యాంగాన్ని మార్చాలంటున్నారని KCR పై మండిపడ్డారు. రాజ్యాంగంలోని ఏ అంశం వాళ్లను అంతగా కలచివేస్తోందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.సఫాయి ఉద్యోగాలు దళితులు తప్ప ఎవరు చేస్తారని మంత్రి సురేష్ అడిగారు. PRC కి సంబంధించి ఒక మెలిక పడిందన్నారు. 

ఈ నెల 1వ తేదీన కేంద్ర బడ్జెట్ పై స్పందించే సమయంలో తెలంగాణ సీఎం కెసీఆర్  రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై BJP, Congress నేతలు మండి పడ్డారు. బీజేపీ నేతలు ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో అంబేద్కర్ విగ్రహం ముందు మౌన దీక్షకు దిగారు. కాంగ్రెస్ నేతలు కూడా హైద్రాబాద్ గాంధీ భవన్ లో దీక్షలు చేశారు.

Latest Videos

Union Budget 2022 పై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించే సమయంలో Indian Constitution ను మార్చాలని  డిమాండ్ చేశారు.  ఈ వ్యాఖ్యలపై   బీజేపీ ఆందోళనకు దిగింది.  బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు  బండి సంజయ్ సహా ఆ పార్టీకి చెందిన ఎంపీలు గురువారం నాడు  తెలంగాణ భవన్ లో  మౌన దీక్షకు దిగాడు.  కేసీఆర్ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు.   అంతేకాదు ఈ వ్యాఖ్యలపై  కేసీఆర్ క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేశారు బీజేపీ నేతలు., తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతలు గురువారం నాడు మౌన దీక్షలు చేశారు. కేసీఆర్ వ్యాఖ్యలపై పలు పార్టీలు కూడా స్పందిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాయి.. కేసీఆర్ వ్యాఖ్యలను సమర్ధిస్తూ టీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు. అంతేకాదు విపక్షాలకు ధీటుగా సమాధానం చెబుతున్నారు.
 

click me!