సృష్టి ఆసుపత్రి కేసు: డాక్టర్ నమ్రతపై ఎథిక్స్ కమిటీకి ఏపీ మెడికల్ కౌన్సిల్ సిఫారసు

By narsimha lodeFirst Published Sep 11, 2020, 2:39 PM IST
Highlights

 సృష్టి ఆసుపత్రి అక్రమాలపై ఏపీ మెడికల్ కౌన్సిల్ విచారణను వేగవంతం చేసింది. సృష్టి ఆసుపత్రిలో పుట్టిన చిన్నారులను విక్రయించారనే  ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. 

అమరావతి: సృష్టి ఆసుపత్రి అక్రమాలపై ఏపీ మెడికల్ కౌన్సిల్ విచారణను వేగవంతం చేసింది. సృష్టి ఆసుపత్రిలో పుట్టిన చిన్నారులను విక్రయించారనే  ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.  ఈ ఆసుపత్రిలో ఇప్పటివరకు ఎంతమందికి డెలీవరీ నిర్వహించారు.. ఈ పిల్లలు ఏమయ్యారనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

also read:విజయవాడ సృష్టి ఆసుపత్రి కేసులో ట్విస్ట్: డాక్టర్ కరుణ కోసం పోలీసుల గాలింపు

విశాఖపట్టణంలోని సృష్టి ఆసుపత్రి రాష్ట్రంలోని పలు చోట్ల తన బ్రాంచీలను ఏర్పాటు చేసి తన దందాను సాగించినట్టుగా పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ఇదే సమయంలో సృష్టి ఆసుపత్రి వ్యవహారాన్ని ఏపీ మెడికల్ కౌన్సిల్ సుమోటోగా తీసుకొని విచారణ చేస్తోంది.

సృష్టి ఆసుపత్రిలో చోటు చేసుకొన్న అక్రమాలపై డాక్టర్ నమ్రతకు ఏపీ మెడికల్ కౌన్సిల్ నోటీసులు జారీ చేసింది. అయితే  ఈ నోటీసులను తీసుకోకుండా సృష్టి ఆసుపత్రి సిబ్బంది వెనక్కి పంపారు.

బినామీ డాక్టర్లతో ఐవీఎఫ్ కేంద్రాలను సృష్టి ఆసుపత్రి యాజమాన్యం నడుపుతున్నట్టుగా గుర్తించారు అధికారులు. డాక్టర్ నమ్రతపై చర్యలకు ఎథిక్స్ కమిటీకి సిఫారసు చేసింది ఏపీ మెడికల్ కౌన్సిల్.

విజయవాడలో సృష్టి ఆసుపత్రిని డాక్టర్ కరుణను బినామీగా పెట్టి నడుపుతున్నారని అధికారులు గుర్తించారు. ప్రస్తుతం డాక్టర్ కరుణ పరారీలో ఉన్నారు. ఆమె కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.డాక్టర్ కరుణ ఆచూకీ లభిస్తే ఈ కేసులో మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశాలు లేకపోలేదు.
 

click me!