ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా వేస్తూ ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటన చేస్తూ ఎన్నికల్లో విధులు సరిగా నిర్వహించని అధికారులపై చర్యలు తీసుకున్నారు మాచర్ల సీఐని సస్పెండ్ చేయాలని ఆదేశించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగిన కొన్ని సంఘటనలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీవ్రంగా స్పందించారు. హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్న గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లను, ఎస్పీలను విధుల నుంచి తప్పించారు.
కొంత మంది పోలీసు అధికారులపై కూడా ఈ సీ చర్యలకు ఆదేశించింది. శ్రీకాళహస్తి, పలమనేరు డిఎస్పీలను, తిరుపతి, పలమనేరు, తాడిపత్రి, రాయదుర్గం సీఐలను ఎన్నికల విధుల నుంచి తప్పించింది. అవసరమైతే తిరుపతి, మాచర్ల, పుంగనూరుల్లో ఎన్నికలను రద్దు చేసే విషయంపై పరిశీలిస్తామని రమేష్ కుమార్ చెప్పారు.
undefined
Also Read: గవర్నర్ కు ఈసీపై ఫిర్యాదు: 'స్థానిక' వాయిదాపై జగన్ తీవ్ర ఆసంతృప్తి
మహిళ అభ్యర్థులను, బీసీ అభ్యర్థులను ఇబ్బంది పెట్టారని, దీన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని రమేష్ కుమార్ అన్నారు. మాచర్ల ఘటనలో సీఐ రాజేశ్వర రావును సస్పెండ్ చేశారు. మాచర్లలో టీడీపీ నేతలు బొండా ఉమామహేశ్వర రావు, బుద్ధా వెంకన్న ప్రయాణిస్తున్న కారుపై వైసీపీ స్థానిక నాయకులు దాడి చేసిన విషయం తెలిసిందే.
గుంటూరు కలెక్టర్ బదిలీ
చిత్తూరు కలెక్టర్ బదిలీ
గుంటూరు ఎస్పీ బదిలీ
చిత్తూరు ఎస్పీ బదిలీ
మాచర్ల సీఐ సస్పెండ్
శ్రీకాళహస్తి డీఎస్పీని ఎన్నికల విధుల నుంచి తప్పించారు.
పలమనేరు డీఎస్పీని ఎన్నికల విధుల నుంచి తప్పించారు.
తిరుపతి సీఐని ఎన్నికల విధుల నుంచి తప్పించారు.
పలమనేరు సీఐని ఎన్నికల విధుల నుంచి తప్పించారు.
రాయదుర్గం సీఐని ఎన్నికల విధుల నుంచి తప్పించారు.
తాడిపత్రి సీఐని ఎన్నికల విధుల నుంచి తప్పించారు.
Also Read: బీజేపీ అభ్యర్ధులకు ఏం కానివ్వను, ఏమైనా జరిగితే రాజీనామా : ఆదినారాయణ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు రమేష్ కుమార్ ఆదివారం ఉదయం ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా ప్రభావం వల్ల ఎన్నికలను వాయిదా వేశామని ఆయన చెప్పారు. అయితే, ఎన్నికల్లో పలు చోట్ల చెలరేగిన ఘటనలపై కూడా ఆయన తీవ్రంగా ప్రతిస్పందించారు.