తిరుపతి, చంద్రగిరి పుదిపట్లలో ఓటర్లు రోడ్డెక్కారు. రేపు పంచాయతీ ఎన్నికలు పెట్టుకుని రాత్రికి రాత్రే రెవెన్యూ అధికారులు ఓటర్లను తొలగిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు.
తిరుపతి, చంద్రగిరి పుదిపట్లలో ఓటర్లు రోడ్డెక్కారు. రేపు పంచాయతీ ఎన్నికలు పెట్టుకుని రాత్రికి రాత్రే రెవెన్యూ అధికారులు ఓటర్లను తొలగిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు.
undefined
శుక్రవారం రాత్రి 10:00 లకు కూడా పుదిపట్ల గ్రామ పంచాయితీ ఆఫీసులో రెవెన్యు అధికారులు, అక్రమంగా ఓట్లు తొలిగిస్తున్నారు. దీంతో అధికార పార్టీ నేతల అండదండలతో రెవెన్యు అధికారులు రెచ్చిపోతున్నారంటూ గ్రామ పంచయతీ ప్రజలు రోడ్డు మీద బైఠాయించారు.
దీంతో పుదుపట్లకు చేరుకున్న సీఐ అక్కడికి చేరుకుని ప్రజలకు సర్ది చెప్పారు. సమస్య ఏదైనా ఉంటే నాతో చెప్పండి, ఎలాంటి ఇబ్బందులు కాకుండా చూసుకుంటానని ప్రజలకు హామీ ఇచ్చారు. దీంతో ఓటర్లు శాంతించారు.