పల్లె పోరు.. ఓట్ల కోసం అభ్యర్థుల తిప్పలు..!

By telugu news teamFirst Published Feb 6, 2021, 9:00 AM IST
Highlights

గ్రామాల్లో ఓటు ఉండి దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉండే వారిని స్వగ్రామానికి రప్పించేందుకు అభ్యర్థులు పోటీలు పడుతున్నారు. ఈ మేరకు ఓటర్ల జాబితాలను ముందేసుకొని ఏ ఓటరు ఎక్కడున్నారు అని పరిశీలిస్తున్నారు. 

ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల పోరు జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా..,ఈ  పంచాయతీ ఎన్నికల సమయంలో.. పట్ణణాల్లో ఉన్న ఓటర్లను పల్లెకు రప్పించేందుకు అభ్యర్థులు చేయని ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఎందుకంటే ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమే. కేవలం ఒకటి రెండు ఓట్ల తేడాతో ఫలితాలు తారుమారు అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అందుకే.. అలా కాకుండా ఉండేందుకు.. ఎన్నికల్లో నిలపడిన అభ్యర్థులు తంటాలు పడుతున్నారు. అందుకోసం ఉన్న ఏ అవకాశాన్నీ వదలుకోవడం లేదు.

గ్రామాల్లో ఓటు ఉండి దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉండే వారిని స్వగ్రామానికి రప్పించేందుకు అభ్యర్థులు పోటీలు పడుతున్నారు. ఈ మేరకు ఓటర్ల జాబితాలను ముందేసుకొని ఏ ఓటరు ఎక్కడున్నారు అని పరిశీలిస్తున్నారు. 

ఉపాధి కోసం వేరే ప్రాంతాలకు వెళ్లిన ఓటర్ల ఫోన్ చేసి. ఓటు వేయడానికి రమ్మంటూ వేడుకుంటున్నారు. అసవరమైతే బస్సు, ట్రెయిన్ ఛార్జీలకు డబ్బులు కూడా  తామే ఇస్తామని.. సీటు రిజర్వేషన్ చేయిస్తామని.. వచ్చి ఓటు వేసి వెళితే చాలాంటూ బ్రతిమిలాడుకుంటున్నారు. ఇలాంటి సంఘటనలు కృష్ణా జిల్లాలో ఎక్కువగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. 
 
click me!