ఏపి స్థానికసంస్థల ఎన్నికలు... ఆ 17మంది ఐఎఎస్ లకు కీలక బాధ్యతలు

Arun Kumar P   | Asianet News
Published : Mar 09, 2020, 04:18 PM IST
ఏపి స్థానికసంస్థల ఎన్నికలు... ఆ 17మంది ఐఎఎస్ లకు కీలక బాధ్యతలు

సారాంశం

ఆంధ్ర ప్రదేశ్ లో జరగనున్న స్థానికసంస్థల ఎన్నికలను జిల్లాలవారిగా పర్యవేక్షించేందుకు 17 మంది సీనియర్ ఐఎఎస్ అధికారులను రాష్ట్ర ఎన్నికల సంఘం నియమించింది. 

విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలైంది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో రాజకీయ పార్టీలన్ని ఎన్నికల బరిలోకి దూకాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకోడానికి వ్యూహాలను రచిస్తున్నారు. ఈ క్రమంలో ఎలాంటి  అక్రమాలు, అవాంఛనీయ ఘటనలు జరక్కుండా ఎన్నికలు ప్రశాంతంగా జరిపేందుకు రాష్ట్ర ఎన్నిక కమీషన్ సిద్దమైంది. ఇందుకోసం జిల్లాలవారిగా ఏర్పాట్లను ముమ్మరం చేస్తోంది. 

స్థానిక సంస్థల ఎన్నికల కోసం రాష్ట్రంలోని 13 జిల్లాలకు 13 మంది సీనియర్ ఐఎఎస్ లను పరిశీలకులుగా నియమిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అలాగే నలుగురు ఐఏఎస్ లను రిజర్వ్ లో వుంచుకుంది. ఏయే జిల్లాలకు ఎవరిని నియమించారన్న వివరాలకు కూడా ఈసీ వెల్లడించింది. 

read more  స్థానికసంస్థల ఎన్నికలు... రాజధాని పరిధిని పెంచిన జగన్ సర్కార్

జిల్లాలవారిగాా అధికారుల వివరాలు

కె. ఆర్.బి. హెచ్. ఎన్. చక్రవర్తి - కర్నూలు,  

ఎం. పద్మ - కృష్ణ జిల్లా , 

పి.ఉషా కుమారి - తూర్పు గోదావరి జిల్లా,   

పి.ఎ.  శోభా - విజయనగరం జిల్లా, 

కె. హర్షవర్ధన్ - అనంతపురం జిల్లా, 

టి. బాబు రావు నాయుడు -  చిత్తూరు జిల్లా,  

ఎం. రామారావు -  శ్రీకాకుళం జిల్లా,  

కె. శారదా దేవి - ప్రకాశం జిల్లా ,

ప్రవీణ్ కుమార్ - విశాఖపట్నం జిల్లా,  

బి. రామారావు -ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా

పి. రంజిత్ బాషా - వైయస్ఆర్ కడప జిల్లా,   

కాంతిలాల్ దండే - గుంటూరు జిల్లా, 

హిమాన్షు శుక్లా -  పశ్చిమ గోదావరి జిల్లా

వీరికి అదనంగా మరో నలుగురు సీనియర్ ఉన్నతాధికారులను కూడా ఈసీ నియమించింది.  సిహెచ్.  శ్రీధర్, జి. రేఖ రాణి, టి.కె.రామమణి, ఎన్.ప్రభాకర్ రెడ్డి లను రిజర్వు లో ఉంచిన‌ట్లు ఈసీ వెల్లడించింది. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్