రెండో దశ పంచాయతీ ఎన్నికలు : పోలింగ్ సరళి పరిశీలించిన కలెక్టర్ ఇంతియాజ్ (వీడియో)

By AN TeluguFirst Published Feb 13, 2021, 10:41 AM IST
Highlights

కృష్ణాజిల్లా వడ్లమన్నాడులో ఎన్నికల సరళిని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ పరిశీలించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని తెలిపారు. ఉదయం ఎనిమిది గంటలకు 7 శాతం పోలింగ్ నమోదైందని వెల్లడించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

"

జిల్లాలో రెండో విడత పోలింగ్ లో భాగంగా గుడివాడ డివిజన్ లోని 9 మండలాల్లో ఈ రోజు ఉదయాన్నే ఆరున్నర గంటలకు పోలింగ్ స్టార్ట్ అయింది. జిల్లాలోని1700లకు పైగా పోలింగ్ స్టేషన్లలో 6.30 నుండి 8.30 వరకు 7 శాతం ఓట్లు పోలయ్యాయని కలెక్టర్ తెలిపారు. 

రాష్ట్రంలో నేడు రెండో విడత పంచాయతీ ఎన్నికలో భాగంగా 13 జిల్లాలు, 18 రెవెన్యూ డివిజన్లు, 167 మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ పోలింగ్ ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు జరుగుతుంది.

3,328 పంచాయతీలు, 33,570 వార్డుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.  రెండో విడతలో 539 పంచాయతీలు, 12,605 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. 2,786 పంచాయతీలు, 20,796 వార్డుల్లో ఎన్నికలు జరుగుతుండగా, పంచాయతీల్లో 7,510 మంది, వార్డుల్లో 44,879 మంది పోటీ పడుతున్నారు. 

click me!