AP Local Body Elections 2026 : ఓటేసిన చంద్రబాబు-భువనేశ్వరి, లోకేష్-బ్రాహ్మణి దంపతులు

Published : Nov 26, 2026, 09:44 AM ISTUpdated : Nov 26, 2026, 09:52 AM IST
Nara Chandrababu

సారాంశం

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులతో పాటు వారి కొడుకు నారా లోకేష్, కోడలు బ్రాహ్మణి కూడా మంగళగిరిలో ఓటుహక్కును వినియోగించుకున్నారు.

AP Panchayat Elections Polling : ఆంధ్ర ప్రదేశ్ గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొండి. ఇప్పటికే మున్సిపల్, ఎంపిటీసి, జడ్పిటిసి ఎన్నికలు ముగియగా ప్రస్తుతం పంచాయితీ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం మూడు విడతల్లో గ్రామ సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి… ఇందులో భాగంగా ఇవాళ (నవంబర్ 26, గురువారం) మొదటి విడత ఎన్నికలు జరుగుతున్న గ్రామాలో పోలింగ్ మొదలయ్యింది.

మొత్తం 201 మండలాల్లోని 3191 గ్రామాల్లో సర్పంచ్, వార్డు మెంబర్లను ఎన్నుకునే ప్రక్రియ కొనసాగుతోంది... ఉదయం 7 గంటలనుండే ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలుతున్నాయి. మధ్యాహ్నం వరకు పోలింగ్ జరగనుంది.. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు, పలితాల వెల్లడి ఉంటుంది.

గ్రామాల్లో పోలింగ్ కోసం 34 వేలకు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేసింది ఎన్నికల సంఘం. ప్రతి ఒక్కరు ఓటుహక్కు వినియోగించుకునేలా చర్యలు చేపట్టింది. ఈ మొదటి విడతలో దాదాపు కోటి మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.

ఓటుహక్కు వినియోగించుకున్ని చంద్రబాబు ఫ్యామిలీ

మొదటి విడత పంచాయితీ ఎన్నికలతో పాటు రెండో విడత మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కూడా కొనసాగుతోంది. 4 మున్సిపల్ కార్పోరేషన్లు, 19 మున్సిపాలిటీలు, నగర పంచాయితీలు కలిపి 23 పట్టణాల్లో పోలింగ్ కొనసాగుతోంది. ఇలా మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పోరేషన్ లో కూడా పోలింగ్ జరుగుతోంది... ఇక్కడే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ ఓటుహక్కు కలిగివుంది. ఈ క్రమంలో ఉదయమే సీఎం నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులతో పాటు మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు కూడా ఓటేశారు. నారా ఫ్యామిలీ మొత్తం ఒకేసారి పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటుహక్కు వినియోగించుకున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Weather Update: ద్రోణి ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు.. ఐఎండీ అలర్ట్
AP Local Body Elections: ఏపీలో ఎన్నికల రణరంగం.. పల్లెలు, పట్టణాల్లో జోరుగా పోలింగ్