పంచాయతీ ఎన్నికలు: తొలి దశకు ముగిసిన ప్రచార గడువు

By Siva KodatiFirst Published Feb 7, 2021, 9:14 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల పోరు వాడీ-వేడీగా సాగుతున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఫిబ్రవరి 9న జరిగే తొలిదశ పంచాయతీ ఎన్నికలకు ప్రచారం ముగిసింది. చివరి రోజు కావడంతో ఆదివారం సర్పంచ్‌ అభ్యర్థులతో పాటు, వార్డు సభ్యులు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకూ విస్తృతంగా ప్రచారం చేశారు

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల పోరు వాడీ-వేడీగా సాగుతున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఫిబ్రవరి 9న జరిగే తొలిదశ పంచాయతీ ఎన్నికలకు ప్రచారం ముగిసింది.

చివరి రోజు కావడంతో ఆదివారం సర్పంచ్‌ అభ్యర్థులతో పాటు, వార్డు సభ్యులు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకూ విస్తృతంగా ప్రచారం చేశారు. తమకు ఓటు వేయాలని కోరుతూ వీధివీధికీ, ఇంటింటికీ తిరిగారు.

తొలిదశలో 3,249 పంచాయతీల పరిధిలో 32,502 వార్డులకు నోటిఫికేషన్‌జారీ అయింది. ఇందులో 518 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మంగళవారం 2,731 పంచాయతీలకు పోలింగ్‌ జరగనుంది.

ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 వరకూ పోలింగ్‌ నిర్వహిస్తారు. ఆ తర్వాత అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టి సర్పంచ్‌ను ప్రకటిస్తారు. మరోవైపు మంగళవారం జరగనున్న ఎన్నికలకు సంబంధించి అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

బ్యాలెట్‌ బాక్సులను సిద్ధం చేసి, పోలింగ్‌ కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఫిబ్రవరి 13న రెండో దశ, ఫిబ్రవరి 17న మూడో దశ, ఫిబ్రవరి 21న నాలుగో దశ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పోలీంగ్ ఏర్పాట్లను స్వయంగా సమీక్షిస్తున్నారు. 

click me!