జగన్ సర్కార్ వర్సెస్ ఎస్ఈసీ: నీలం సాహ్నీ లేఖకు నిమ్మగడ్డ ఘాటు రిప్లై

By telugu teamFirst Published Nov 18, 2020, 8:27 AM IST
Highlights

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ఏపీ సీఎస్ నీలం సాహ్నీ రాసిన లేఖకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సమాధానం ఇచ్చారు. నీలం సాహ్నీ లేఖను నిమ్మగడ్డ ఆక్షేపించారు.

అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని లేఖకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఎస్ఎంఎస్ ద్వారా ఆయన నీలం సాహ్నీకి తన సమాధానం పంపించారు. 

నీలం సాహ్నీ రాసిన లేఖ ఎన్నికల కమిషన్ స్వయంప్రతిపత్తిని ప్రశ్నించేలా ఉందని ఆయన అన్నారు ఎన్నికల కమిషన్ స్వయం ప్రతిపత్తిని ప్రశ్నించడమేమిటని ఆయన అడిగారు  రాజ్యంగా విరుద్ధంగా నీలం సాహ్నీ రాసిన లేఖ ఉందని ఆయన అన్నారు.

Also Read: స్థానిక పోరుపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ పట్టు: నీలం సాహ్ని అడ్డుపుల్ల

ప్రస్తుత పరిస్థితిలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు లేఖ రాసిన విషయం తెలిసింేద. స్థానిక సంస్థల ఎన్నికలను ఇప్పుడు నిర్వహించతడం సాధ్యం కాదని ఆమె ఆ లేఖలో స్పష్టం చేశారు. కరోనా వైరస్ ఇంకా అదుపులోకి రాలేదని ఆమె చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వైరస్ యాక్టివ్ కేసులు ఇంకా ఉన్నాయని చెప్పారు. పోలీసు, జిల్లా యంత్రాంగాలు కరోనా కట్టడి విధుల్లో ఉన్నారని ఆమె చెప్పారు. 

కరోనా కట్టడికి రాష్ట్రాలు వాటి పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకున్నాయని, ఎపీని ఇతర రాష్ట్రాలతో పోల్చడం సరి కాదని, చలికాలంలో మరింత అప్రమత్తత అవసరమని నీలం సాహ్నీ తన లేఖలో వివరించారు. ఎపీలో 6890 మంది కరోనా వల్ల మరణించారని, మరోసారి కరోనా వ్యాపించే ప్రమాదం ఉందని ఆమె అన్నారు. 

Also Read: స్థానిక ఎన్నికలపై ఈసీ దూకుడు: రేపు గవర్నర్‌తో నిమ్మగడ్డ భేటీ

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పరిస్థితి అనుకూలించిన వెంటనే ప్రభుత్వం ఎస్ఈసీకి సమాచారం ఇస్తుందని ఆమె అన్నారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని అనుకోవడం సరి కాదని ఆమె స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహించాలని తీసుకున్న నిర్ణయంపై పునరాలోచన చేయాలని ఆమె ఎస్ఈసీకి సూచించారు. 

ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వీడియో కాన్ఫరెన్స్ అవసరం లేదని తాము భావిస్తున్నామని ఆమె అన్నారు.

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పారు. ఎన్నికలను నిర్వహించడానికి పట్టుదలతో ఉన్న రమేష్ కుమార్ ఈ రోజు బుధవారం గవర్నర్ బిశ్వభూషన్  ను కలుస్తున్నారు. 

గ్రామ పంచాయతీ ఎన్నికలపై ఎస్ఈసీ రమేష్ కుమార్ వివిధ స్థాయిల్లోని అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని నిర్ణయించారు. అయితే, నీలం సాహ్నీ లేఖతో ఈ వీడియో కాన్ఫరెన్స్ మీద సందిగ్ధత నెలకొంది. ఈ స్థితిలో అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం సాధ్యం కాదని నీలం సాహ్నీ స్పష్టం చేశారు. వీడియో కాన్ఫరెన్స్ మీద మరిన్ని సంప్రదింపులు జరగాలని అధికారులు అంటున్నారు.

ఇదిలావుంటే, ప్రభుత్వ తీరుపై మరోసారి కోర్టును ఆశ్రయించేందుకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారని, బీహార్ శాసనసభ ఎన్నికలు జరిగాయని, ఈ స్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సాధ్యమేనని నిమ్మగడ్డ రమేష్ కుమార్ వాదిస్తున్నారు. 

click me!