ఏపీలో జూడాల సమ్మె ఉదృతం... ఓపి సేవలు బహిష్కరించి హాస్పిటల్స్ ఎదుట ఆందోళన (వీడియో)

Arun Kumar P   | Asianet News
Published : Dec 10, 2021, 12:30 PM ISTUpdated : Dec 10, 2021, 12:40 PM IST
ఏపీలో జూడాల సమ్మె ఉదృతం... ఓపి సేవలు బహిష్కరించి హాస్పిటల్స్ ఎదుట ఆందోళన (వీడియో)

సారాంశం

ఆంధ్ర ప్రదేశ్ లో జూనియర్ డాక్టర్ల సమ్మె ఉదృతమయ్యింది. ఇవాళ ఓపి సేవలను నిలిపివేసిన జూడాలు హాస్పిటల్స్ ఎదుట ఆందోళన చేపట్టారు. 

విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ లో పనిచేస్తున్న జూనియర్ డాక్టర్లు సమ్మెబాట (junior doctors strike) పట్టిన విషయం తెలిసిందే. తమ సమస్యలను పరిష్కారించాలంటూ ఏపీ జూడాల అసోసియేషన్ డిసెంబర్ 1వ తేదీ నుంచి వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేస్తున్నారు. తాజాగా ఈ నిరసనలను మరింత ఉదృతం చేసిన జూడాలు ఓపి (OP Services) సేవలు బహిష్కరించి ఆందోళనకు దిగారు. 

విజయవాడ (vijayawada)లో జూనియర్ డాక్టర్లు కూడా వైద్యసేవలను బహిష్కరించి ఆందోళనకు దిగారు. తమ డిమాండ్లను పరిష్కరించడమే కాదు తమకు రక్షణ కల్పించాలని కోరారు. ప్రజలకు సేవలందిస్తున్న తమపై దాడులు చేయడం సబబేనా? అని ప్రశ్నించారు. కరోనా (corona) సమయంలో కూడా ప్రాణాలకు తెగించి సేవలు చేశామని... ప్రాణాలను ఫణంగా పెట్టి ఎంతోమంది ప్రాణాలను కాపాడామని జూడాలు గుర్తుచేసారు. అలాంటిది తమపై ఇటీవల దాడులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేసారు. 

Video

డాక్టర్ల రక్షణ కోసం చట్టాలు ఉన్నా వాటిని అధికారులు అమలు చేయడం లేదని జూడాలు ఆరోపించారు. మొక్కుబడి చర్యల వల్ల తమకు సరయిన రక్షణ లేకుండా పోయిందని... కఠిన శిక్షలు ఉంటేనే దాడులను అరికట్టవచ్చని పేర్కొన్నారు. తమకు భద్రత ఉంటుందనే భరోసా ప్రభుత్వమే కల్పించాలని... దాడులు చేసిన వారిని అరెస్టు చేసి వెంటనే  శిక్ష పడేలా చూడాలని జూడాలు డిమాండ్ చేసారు.

read more  మాస్క్ లేని వారిని రానిస్తే యజమానులకు భారీ జరిమానా.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

డాక్టర్ల భద్రత (doctors security)తో పాటు వివిద డిమాండ్లను ప్రభుత్వం ముందుంచింది జూనియర్ డాక్టర్ల అసోసియేషన్. వాటిపై ప్రభుత్వం స్పందించకపోవడంతో గత పదిరోజులుగా వివిద రకాలుగా నిరసన తెలుపుతున్న జూడాలు ఆందోళనను ఉదృతం చేసారు. తాజాగా ఓపి సేవలను నిలిపివేసిన జూడాలు ఇప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే అత్యవసర సేవలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. 

తమకు ఇస్తున్న స్టైఫండ్‌లో 10% టాక్స్ కట్ చేస్తున్న విధానాన్ని జూడాలు తప్పుబడుతున్నారు. సెక్షన్ 10(16) కింద స్టైఫండ్‌ను స్కాలర్ షిప్‌గా పరిగణించి ట్యాక్స్ కట్ చేయకూడదని జూడాలు డిమాండ్  చేస్తున్నారు. అలాగే త్వరితగతిన నీట్(NEET), పీజీ కౌన్సిలింగ్ జరిపి రిక్రూట్ చేసుకోవాలని మరో డిమాండ్ కూడా చేస్తున్నారు. ఈ డిమాండ్ల పరిష్కారానికి డిసెంబర్ 1వ తేదీ నుండి సమ్మెకు దిగుతున్నట్లు జూడాల అసోసియేషన్ ప్రకటించింది. 

read more  మావి గొంతెమ్మ కోర్కెలు కావు- ఏపీ ఉద్యోగ జేఏసీ నాయ‌కుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు

డిసెంబర్ 1వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా పనిచేసే హాస్పిటల్స్ వద్ద జూడాలు నల్ల బ్యాడ్జ్‌లతో జూడాలు నిరసన చేపట్టారు. డిసెంబర్ 2న సంబంధిత కళాశాలల వద్ద క్యాండిల్‌ లైట్ మార్చ్ నిర్వహించారు. డిసెంబర్ 3న జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులకు తమ సమస్యలను తెలియజేస్తూ లేఖల సమర్పించారు. డిసెంబర్ 4న ట్విట్టర్ తుఫాను, మాస్ మెయిలింగ్ రూపంలో సోషల్ మీడియాలో క్యాంపెయిన్ నిర్వహించారు. 

ఇక డిసెంబర్ 5వ తేదీ నుండి  నిరసనను మరింత తీవ్రతరం చేసారు. ఐచ్చిక సేవలు, ఓపి సేవలను నిలిపివేసిన జూడాలు చివరి అస్త్రంగా అత్యవసర సేవలను నిలిపివేయడానికి సిద్దమయ్యింది. వెంటనే ప్రభుత్వం తమ డిమాండ్లను ఒప్పుకోవాలని జూనియర్ డాక్టర్లు కోరుతున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్