ఏపీ ఇంటర్ పరీక్షల 2023 షెడ్యూల్ విడుదల: మార్చి 15 నుండి ఎగ్జామ్స్

Published : Dec 26, 2022, 10:06 PM ISTUpdated : Dec 30, 2022, 04:33 PM IST
ఏపీ ఇంటర్  పరీక్షల 2023 షెడ్యూల్ విడుదల: మార్చి  15 నుండి  ఎగ్జామ్స్

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  ఇంటర్  పరీక్షల షెడ్యూల్ ను విడుదల  చేసింది ఇంటర్మీడియట్ బోర్డు. ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో  వచ్చే ఏడాది మార్చి  15వ తేదీ నుండి  ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  ఇంటర్ పరీక్షలను వచ్చే ఏడాది మార్చి  15 నుండి ఏప్రిల్  4వ తేదీ వరకు  నిర్వహించనున్నారు.  ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ను  ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు  సోమవారం నాడు విడుదల చేసింది.వచ్చే ఏడాది మార్చి  15వ తేదీన  ఇంటర్మీడియట్  ప్రథమ సంవత్సరం  పరీక్షలు  ప్రారంభం కానున్నాయి. మార్చి  16 నుండి ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం  పరీక్షలు ప్రారంభం కానున్నట్టుగా  ఇంటర్ బోర్డు తెలిపింది.ఉదయం 9 గంటలనుండి మధ్యాహ్నం 12 గంటల వరకు  పరీక్షలు నిర్వహించనున్నారు.  

మార్చి  15న ఇంటర్ ఫస్టియర్ కు చెందిన సెకండ్ లాంగ్వేజ్  పరీక్ష నిర్వహిస్తారు.మార్చి  17న ఇంగ్లీష్, మార్చి 20న గణితం పేపర్ -1ఏ ,  బోటనీపేపర్ -1, సివిక్స్ పేపర్ -1, మార్చి 23న గణితం పేపర్-1బీ, జువాలజీ పేపర్-1,హిస్టరీ-1,మార్చి  25న ఫిజిక్స్  పేపర్-1, ఎకనామిక్స్-1, మార్చి 28న కెమిస్ట్రీ పేపర్-1,కామర్స్ పేపర్-1,సోషియాలజీ పేపర్ -1, ఫైన్ ఆర్ట్స్ , మ్యూజిక్  పేపర్ -1,మార్చి  31న  పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్  పేపర్ -1, ఏప్రిల్  3న మోడ్రన్  లాంగ్వేజ్ పేపర్ -1, జియాగ్రఫీ పేపర్ -1 పరీక్షలు నిర్వహించనున్నారు.

మార్చి 16న ఇంటర్  సెకండియర్ సెకండ్ లాంగ్వేజ్  పరీక్ష నిర్వహించనున్నారు. మార్చి 18న ఇంగ్లీష్  పేపర్ -2 , మార్చి 21న గణితం పేపర్ -2 ఏ, బొటనీ పేపర్ -2, సివిక్స్ పేపర్ -2, మార్చి 24న గణితం పేపర్  -2బీ, జువాలజీ పేపర్ -2, హిస్టరీ పేపర్ -2, మార్చి  27న ఫిజిక్స్  పేపర్  -2,ఎకనామిక్స్  పేపర్ -2 , మార్చి  29న కెమిస్ట్రీ-2, కామర్స్ పేపర్ -2,సోషియాలజీ  పేపర్ -2, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్  పేపర్  -2,  ఏప్రిల్ 1న పబ్లిక్ అడ్మినిస్టేషన్ పేపర్  -2, ఏప్రిల్  4న మోడ్రన్ లాంగ్వేజ్  పేపర్ -2, జియాగ్రఫీ పేపర్  -2 పరీక్షలు నిర్వహించనున్నారువచ్చే ఏడాది ఫిబ్రవరి 22న ఎథిక్స్ , ఫిబ్రవరి  24న హుమన్ వాల్యూస్  పరీక్షలను ఇంటర్ ఫస్టియర్  విద్యార్ధులకు నిర్వహిస్తారు. ఇంటర్ సెకండియర్ విద్యార్ధులకు  ఏప్రిల్  15 నుండి  25వరకు  పరీక్షలు నిర్వహించనున్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలనే  ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

IAS Amrapali Kata Speech: విశాఖ ఉత్సవ్ లో ఆమ్రపాలి పవర్ ఫుల్ స్పీచ్ | Asianet News Telugu
Visakha Utsav Curtain Raiser Event: హోం మంత్రి అనిత సెటైర్లు | Asianet News Telugu