స్వాతంత్య్రానికి ముందు భారత ప్రజల ఐక్యతకు చిహ్నంగా జిన్నా టవర్ ను నిర్మించారని సుచరిత గుర్తుచేశారు. భారత సరిహద్దుల్లో వీర జవాన్ లు కాపలా ఉండటం వలనే మనమందరం ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నామన్నారు. జిన్నా టవర్ విషయాన్ని బీజేపీ రాజకీయ లబ్ది కోసం వాడుకోవాలని చూడటం బాధాకరం, సిగ్గుచేటన్నారు
ఉద్యోగుల చలో విజయవాడపై (chalo vijayawada) స్పందించారు ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత (mekathoti sucharitha) . గుంటూరు (guntur) జిన్నాటవర్ సెంటర్ (jinnah tower) వద్ద ఆమె గురువారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుచరిత మాట్లాడుతూ.. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని సూచించారు. చర్చలకు అవకాశం ఇవ్వలేదనడం అబద్ధమని.. హౌస్ అరెస్ట్‌లు లేవని, అనుమతి లేని సభకు వెళ్లొద్దని చెప్పామని సుచరిత తెలిపారు. ఉద్యోగులు సహకరించాలని సీఎం జగన్ (jagan) చెప్పారని.. ఉద్యోగులకు మేలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా వుందని హోంమంత్రి స్పష్టం చేశారు. కరోనాతో రాష్ట్రంలో ఆర్ధిక ఇబ్బందులున్నాయని ఆమె అన్నారు.
ఎందరో మహానుభావులు చేసిన త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్చా, స్వాతంత్య్రాలను అనుభవిస్తున్నామని సుచరిత వ్యాఖ్యానించారు.
గుంటూరు నగరంలో జిన్నా టవర్ కు చాలా ప్రత్యేక స్థానం ఉందని.. జిన్నా టవర్ కట్టే సమయానికి ఇక్కడ చాలా మంది పుట్టి వుండరని ఆమె అన్నారు. స్వాతంత్య్రానికి ముందు భారత ప్రజల ఐక్యతకు చిహ్నంగా జిన్నా టవర్ ను నిర్మించారని సుచరిత గుర్తుచేశారు. భారత సరిహద్దుల్లో వీర జవాన్ లు కాపలా ఉండటం వలనే మనమందరం ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నామన్నారు.
undefined
ఈ జవాన్‌లలో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్, సిక్కులు ఇలా ప్రతి ఒక్కరూ వుంటారని.. జిన్నా టవర్ విషయాన్ని బీజేపీ రాజకీయ లబ్ది కోసం వాడుకోవాలని చూడటం బాధాకరం, సిగ్గుచేటన్నారు. మానవాళికి మంచి చేసిన వారిని స్మరించుకోవడం మన భారతీయులకు అలవాటని సుచరిత అన్నారు. భారత దేశాన్ని పాలిస్తున్న పాలకులు సమానంగా చూడాల్సింది పోయి.. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూడటం అత్యంత బాధాకరమని ఆమె పేర్కొన్నారు.
భారత దేశం గణతంత్ర, లోకిక రాజ్యం అని భావిస్తూ ప్రజలందరూ ఐకమత్యంగా, సోదర భావంతో కలిసి జీవిస్తున్నామని.. ముఖ్యమంత్రి జగన్ కులాలు, మతాలు, పార్టీ లు అని చూడకుండా ప్రతి ఒక్కరూ లబ్దిపొందేలా సంక్షేమ పాలన చేస్తున్నారని సుచరిత ప్రశంసించారు. బీజేపీ మాత్రం కులాల మధ్య కుమ్ములాటలు పెట్టి, హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్ లు వేరు అని మాట్లాడటం తగదని హోంమంత్రి హితవు పలికారు. ముందుగా మనమందరం భారతీయులం, ఆ తరువాతే హిందువు, ముస్లిం, క్రిస్టియన్ అని అన్నారు.
ప్రతి ఒక్కరం కలిసి దీపావళి, రంజాన్, క్రిస్మస్ పండుగలను జరుపుకుంటామని.. భారత ప్రజలందరూ ఐకమత్యంగా సోదర భావంతో వుంటున్నాము కాబట్టే ప్రశాంతంగా జీవిస్తున్నామని సుచరిత అన్నారు. గుంటూరు లో జిన్నా టవర్ వివాదం రావడమే ఒక దురదృష్టకరమైన సంఘటనగా ఆమె అభివర్ణించారు. దీనికి ఒక చక్కటి పరిష్కారం చూపుతూ జిన్నా టవర్ కు జాతీయ జండా రంగులు వేయడం, జండా ఎగరవేయడం ఎంతో శుభపరిణామమన్నారు. ఐకమత్యం, జాతీయత భావం అంటే ఎలా ఉంటుందో గుంటూరు ప్రజలు చేసి చూపించారని సుచరిత ప్రశంసించారు.