పీఆర్సీ వివాదం: ఏపీ సీఎం జగన్‌తో సజ్జల భేటీ

By narsimha lode  |  First Published Feb 3, 2022, 3:29 PM IST


ఉద్యోగుల డిమాండ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ప్రజాస్వామ్యయుతంగా లేదని పీడీఎఫ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు అభిప్రాయపడ్డారు.ఉద్యోగులకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన ప్రకటించారు.


విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు Sajjala Ramakrishna Reddy గురువారం నాడు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి YS Jaganతో భేటీ అయ్యారు. ఉద్యోగుల చలో Vijayawada నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సంప్రదింపుల కమిటీలో సజ్జల రామకృష్ణారెడ్డి కూడా సభ్యుడిగా ఉన్నారు.

PRC జీవోలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో ఇవాళ ఛలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమం విజయవంతమైందని Employees ప్రకటించాయి. గతంలో తాము ప్రకటించిన ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా  ఈ నెల 7వ తేదీన Strike నిర్వహిస్తామని ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి.
ఈ నెల 5వ తేదీ నుండి సహాయ నిరాకరణను కొనసాగిస్తామని కూడా ఉద్యోగ సంఘాలు గురువారం నాడు తేల్చి చెప్పాయి.

Latest Videos

సీఎం జగన్ తో సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి Sameer Sharma కూడా భేటీ అయ్యారు. ఉద్యోగుల పీఆర్సీ అంశంపై సీఎస్ జగన్ తో  చర్చించారని సమాచారం. ఇవాళ సాయంత్రం ఉద్యోగుల పీఆర్సీ అంశానికి సంబంధించి సీఎస్ సమీర్ శర్మ మీడియాతో మాట్లాడనున్నారు.

రెండు రోజుల క్రితం ప్రభుత్వ సంప్రదింపుల కమిటీతో ఉద్యోగ సంఘాల నేతలు భేటీ అయ్యారు. అయితే ఛలో విజయవాడ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని కూడా ఉద్యోగ సంఘాలు మంత్రుల కమిటీకి చెప్పారు. 

click me!