అనూష హత్య జరిగి 7 నెలలైంది.. ఇప్పుడు పరామర్శిస్తారా: లోకేశ్‌పై సుచరిత ఆగహం

By Siva KodatiFirst Published Sep 9, 2021, 7:48 PM IST
Highlights

నరసరావుపేటలో అనూష హత్య జరిగిన 7 నెలలకు నారా లోకేశ్‌ పరామర్శకు వచ్చారని.. హత్య జరిగిన 7 రోజుల్లోనే ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసినట్లు ఏపీ హోంమంత్రి సుచరిత వెల్లడించారు. పరామర్శ పేరుతో  లోకేశ్ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పరిస్థితులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. 
 

దేశంలో మహిళల భద్రతకు యాప్ తీసుకొచ్చిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అన్నారు రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత . గురువారం తాడేపల్లిలో సీఎం జగన్‌తో సమావేశం అనంతరం హోంమంత్రి మీడియాతో మాట్లాడారు. లోకేశ్‌ పర్యటనను అడ్డుకోవడం సహా తాజా పరిణామాలపై ముఖ్యమంత్రితో చర్చించినట్లు చెప్పారు. దిశ చట్టం, యాప్‌పై మహిళల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని సుచరిత స్పష్టం చేశారు. మహిళల భద్రత, అత్యాచార సమయాల్లో తీసుకోవాల్సిన చర్యలపై సీఎంతో చర్చించినట్లు ఆమె చెప్పారు.

నరసరావుపేటలో అనూష హత్య జరిగిన 7 నెలలకు నారా లోకేశ్‌ పరామర్శకు వచ్చారని.. హత్య జరిగిన 7 రోజుల్లోనే ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసినట్లు మంత్రి వెల్లడించారు. పరామర్శ పేరుతో  లోకేశ్ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పరిస్థితులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో మహిళలపై ఎన్నో నేరాలు జరిగాయని... మహిళలపై జరిగే నేరాల విషయంలో రాజకీయాలు చేయడం బాధాకరమని హోంమంత్రి వ్యాఖ్యానించారు. టీడీపీ హయాంలో ఎప్పుడైనా వారంలో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారా?అని సుచరిత ప్రశ్నించారు.

ALso Read:నేను నరసరావుపేట వెళ్తానంటే అంత భయమెందుకు: జగన్‌పై లోకేశ్ విమర్శలు

స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం దిశ చట్టంపై అసత్య ప్రచారం చేస్తూ మహిళలకు అభ్రదతా భావం కల్పిస్తున్నారన్నారని హోంమంత్రి మండిపడ్డారు. మహిళల భద్రత విషయంలో టీడీపీకి చిత్తశుద్ధి ఉంటే దిశ చట్టాన్ని పార్లమెంట్‌ వెంటనే ఆమోదించే విధంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ఎక్కడైనా మహిళ చనిపోతే బాగుండు.. అక్కడికి వెళ్లి మేము రాజకీయాలు చేసుకుంటాం’’ అనే విధంగా రాజకీయాలు చేస్తున్న వారిని చూస్తే బాధ కలుగుతుందని సుచరిత ఆవేదన వ్యక్తం చేశారు. దిశ చట్టం విషయంలో ఏమైనా మార్పులు, సూచనలు చేస్తే స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆమె స్పష్టం చేశారు.  
 

click me!