ఏపీలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన మంత్రి

Published : Jan 01, 2019, 11:46 AM IST
ఏపీలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన మంత్రి

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల సమరానికి అప్పుడే రెడీ అవుతుంది. మరికొద్ది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకాబోతుంది. అందుకు అన్ని పార్టీలు గెలుపు గుర్రాలపై కసరత్తు చేస్తున్నారు. ఏ పార్టీ ఇంకా పూర్తి స్థాయిలో అభ్యర్థులను ఖరారు చేసిన దాఖలాలు లేవు. 

పెద్దాపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల సమరానికి అప్పుడే రెడీ అవుతుంది. మరికొద్ది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకాబోతుంది. అందుకు అన్ని పార్టీలు గెలుపు గుర్రాలపై కసరత్తు చేస్తున్నారు. ఏ పార్టీ ఇంకా పూర్తి స్థాయిలో అభ్యర్థులను ఖరారు చేసిన దాఖలాలు లేవు. 

అయితే ఏపీ హోం శాఖ మంత్రి డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప మాత్రం తన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టేశారు. రాష్ట్రంలోనే  ఎన్నికల ప్రచారావనికి శంఖారావం పూరించిన మెుట్టమెదటి వ్యక్తిగా హోంమంత్రి చినరాజప్ప నిలిచిపోయారు.

హోంమంత్రి గురువు కంచి మహాసంస్థాన అధ్యక్షుడు చంద్రాభట్ల చింతామణిగణపతి శాస్త్రి చినరాజప్ప ఇంటి వద్ద ప్రచార రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హోంమంత్రిని ఆశ్వీరదించారు. పూజల అనంతరం పట్టణంలోని తూర్పుదిక్కుగా ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభించారు హోం మంత్రి చినరాజప్ప. 

రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయాన్ని ఏశక్తులు అడ్డుకోలేవన్నారు. మళ్లీ తమ పార్టీయే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అంతకు ముందు కుమారరామ భీమేశ్వరాలయంలో హోంమంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు.  

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu