ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ప్రమాణం చేసిన జస్టిస్ ప్రవీణ్ కుమార్

By sivanagaprasad kodatiFirst Published Jan 1, 2019, 10:44 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రవీణ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహాన్.. ప్రవీణ్ కుమార్ చేత ప్రమాణం చేయించారు. 

ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయడుతో పాటు హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. నిన్నటి వరకు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడిగా సేవలందించిన హైకోర్టును విభజిస్తూ కేంద్రప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.

దీంతో జనవరి 1 నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వేర్వేరు హైకోర్టులు సేవలందిస్తాయి. అమరావతిలోని హైకోర్టు భవనం పూర్తయ్యేవరకు విజయవాడలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో తాత్కాలిక హైకోర్టు భవనాన్ని ఏర్పాటు చేశారు. 

click me!