డిప్యూటీ సీఎంకి ఝలక్: జనసేనలో చేరిన సోదరుడు

Published : Feb 03, 2019, 08:05 AM ISTUpdated : Feb 03, 2019, 08:10 AM IST
డిప్యూటీ సీఎంకి ఝలక్: జనసేనలో చేరిన సోదరుడు

సారాంశం

పార్టీకి వీరవిధేయుడుగా ఉంటూ రాబోయే ఎన్నికల్లో గెలుపుకోసం ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో సోదరుడు ఝలక్ ఇచ్చారు. చినరాజప్ప  సోదరుడు లక్ష్మణ్ మూర్తి జనసేన పార్టీలో చేరడం చర్చనీయాంశంగా మారింది.  

అమలాపురం: ఏపీ డిప్యూటీ సీఎం, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్పకు గట్టి షాక్ తగిలింది. తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా పేర్గాంచిన చినరాజప్ప ఓ వెలుగువెలుగొందుతున్నారు. 

పార్టీకి వీరవిధేయుడుగా ఉంటూ రాబోయే ఎన్నికల్లో గెలుపుకోసం ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో సోదరుడు ఝలక్ ఇచ్చారు. చినరాజప్ప  సోదరుడు లక్ష్మణ్ మూర్తి జనసేన పార్టీలో చేరడం చర్చనీయాంశంగా మారింది.

 శనివారం ఉప్పలగుప్తం మండలం పెదగాడవల్లిజనసేన ప్రచార కార్యక్రమంలో ఆయన జనసేన కండువా కప్పుకున్నారు. అంతేకాదు కాపు సామాజకిక వర్గం అంతా పవన్ కళ్యాణ్ కు అండగా నిలవాలని సూచించారు కూడా. సోదరుడు ఝలక్ పై చినరాజప్ప ఎలా స్పందిస్తారో వేచి చూడాలి మరి.  

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?