అమరావతికి చేరుకున్న సీజేఐ: అమ్మవారిని దర్శించుకున్న రంజన్ గొగోయ్ దంపతులు

By Nagaraju penumalaFirst Published Feb 2, 2019, 10:45 PM IST
Highlights

రంజన్ గొగోయ్ తో పాటు సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణతోపాటు ఇతర న్యాయమూర్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. భారత ప్రధాన న్యాయమూర్తికి ఆలయ మర్యాదలతో ఈవో కోటేశ్వరమ్మ స్వాగతం పలికారు. వేద మంత్రోశ్చరణల నడుమ ఆలయ పండితులు, అధికారులు సీజేఐ దంపతులకు ఘన స్వాగతం పలికారు. 

విజయవాడ: అమరావతిలో తాత్కాలిక హైకోర్టు ప్రారంభోత్సం, శాశ్వత హైకోర్టు భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ అమరావతి చేరుకున్నారు. అమరావతి చేరుకున్న రంజన్ గొగోయ్ కు హైకోర్టు రిజిస్ట్రార్ స్వాగతం పలికారు. 

ఏపీ పోలీసులు ఆయనకు గౌరవ వందనం చేశారు. అనంతరం ఆయన నోవాటెల్ లో బస చేశారు. కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత ఆయన ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీకనకదుర్గమ్మవారిని సతీ సమేతంగా దర్శించుకున్నారు. 

రంజన్ గొగోయ్ తో పాటు సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణతోపాటు ఇతర న్యాయమూర్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. భారత ప్రధాన న్యాయమూర్తికి ఆలయ మర్యాదలతో ఈవో కోటేశ్వరమ్మ స్వాగతం పలికారు. వేద మంత్రోశ్చరణల నడుమ ఆలయ పండితులు, అధికారులు సీజేఐ దంపతులకు ఘన స్వాగతం పలికారు. 

పంచహారతుల అనంతరం అమ్మవారి చిత్రపటంతోపాటు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అటు ఆంధ్ర ప్రదేశ్ జలవనరుల శాఖమంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు సైతం సీజేకు స్వాగతం  మాత్యులు దేవినేని ఉమా మహేశ్వర రావు స్వాగతం పలికారు. 

అనంతరం హోటల్ లో బస చేసిన ఆయనను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రవీణ్ కుమార్ కలిశారు. ఆదివారం ఏర్పాట్లపై చర్చించారు. ఆ తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సైతం రంజన్ గొగోయ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. 

ఆదివారం ఉదయం 11 గంటలకు నేలపాడులోని తాత్కాలిక హైకోర్టు భవనాలను ప్రారంభించనున్నారు. అదే సమయంలో శాశ్వత హైకోర్టు భవన నిర్మాణ పనులకు కూడా ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. హైకోర్టు ప్రారంభోత్సవం సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది ఏపీ పోలీస్ శాఖ. 

click me!