పంతం నెగ్గించుకున్న జగన్.. పవన్ వకీల్ సాబ్‌కు హైకోర్టు షాక్: టికెట్ రేట్లు పెంచొద్దంటూ తీర్పు

Siva Kodati |  
Published : Apr 10, 2021, 06:50 PM IST
పంతం నెగ్గించుకున్న జగన్.. పవన్ వకీల్ సాబ్‌కు హైకోర్టు షాక్: టికెట్ రేట్లు పెంచొద్దంటూ తీర్పు

సారాంశం

ఏపీలో హాట్ టాపిక్‌గా మారిన పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ సినిమాకు సంబంధించి హైకోర్టు షాకిచ్చింది. వకీల్ సాబ్ మూవీ టికెట్ ధరల పెంపులపై హైకోర్టులో విచారణ ముగిసింది. టికెట్ ధర పెంపును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది

ఏపీలో హాట్ టాపిక్‌గా మారిన పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ సినిమాకు సంబంధించి హైకోర్టు షాకిచ్చింది. వకీల్ సాబ్ మూవీ టికెట్ ధరల పెంపులపై హైకోర్టులో విచారణ ముగిసింది. టికెట్ ధర పెంపును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.

ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం టికెట్ల ధరలు పెంచొద్దని ఆదేశించింది. గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను సస్పెండ్ చేస్తూ డివిజన్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి రెండు రోజులు మాత్రమే టికెట్ల ధరలు పెంచుకునే అవకాశం వుందని తెలిపింది. రేపటి నుంచి టికెట్ల ధరలు పెంచొద్దని ఏపీ హైకోర్టు థియేటర్ల యజమానులను ఆదేశించింది. 

మూడు రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకోవచ్చునని హైకోర్టు తీర్పు చెప్పింది. టికెట్ ధరల పెంపును, బెనిఫిట్ షోలను వైఎస్ జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనుమతించలేదు. దాంతో వివాదం కోర్టుకు ఎక్కింది. 

Also Read:వకీల్ సాబ్ వివాదం: హైకోర్టు తీర్పుపై జగన్ ప్రభుత్వం హౌస్ మోషన్ పిటిషన్

పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా టికెట్ ధరలను పెంచుకోవడానికి, బెనిఫిట్ సినిమాలు వేయడానికి జగన్ ప్రభుత్వం అనుమతించలేదు. దీంతో ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కల్యాణ్ అభిమానులు పలు చోట్ల ఆందోళనలకు దిగారు. థియేటర్లపై దాడులు కూడా చేశారు. 

వకీల్ సాబ్ సినిమా విషయంలో ప్రభుత్వ తీరును తప్పు పడుతూ బిజెపి నేతలు సునీల్ దియోధర్, సత్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ సినిమా విజయం సాధించిందని, తాము తిరుపతిలో విజయం సాధిస్తామని సునీల్ దియోధర్ అన్నారు.

ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా వకీల్ సాబ్ వివాదంలో పవన్ కల్యాణ్ కు మద్దతుగా నిలిచారు. తాము వ్యాపారాలు చేసుకోకూడదా అని ఆయన వ్యాఖ్యానించారు. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu