ఏపీ: ఐఏఎస్, ఐపీఎస్‌ల వార్షిక నివేదిక ఆమోదం.. ఇక సీఎం చేతుల్లో

By Siva KodatiFirst Published Apr 10, 2021, 4:00 PM IST
Highlights

ఏపీ కేడర్‌ అఖిల భారత సర్వీసు అధికారుల వార్షిక నివేదిక ఆమోదానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పలు మార్పులు చేసింది. వార్షిక పనితీరు నివేదికలు ఆమోదించే అధికారం ముఖ్యమంత్రికి అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది

ఏపీ కేడర్‌ అఖిల భారత సర్వీసు అధికారుల వార్షిక నివేదిక ఆమోదానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పలు మార్పులు చేసింది. వార్షిక పనితీరు నివేదికలు ఆమోదించే అధికారం ముఖ్యమంత్రికి అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

దీంతో ఇక నుంచి ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ అధికారుల నివేదికలు సీఎంకు అందజేయనున్నారు . వీటితో పాటు అధికారుల పనితీరు, ప్రవర్తన మదింపు చేసే అధికారం కూడా ముఖ్యమంత్రికే అప్పగించారు.   

మెరుగైన ఫలితాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ వెల్లడించారు. గవర్నర్‌ కార్యదర్శి పనితీరు నివేదిక గవర్నర్‌ ఆమోదిస్తారని ఆయన ఉత్తర్వుల్లో తెలిపారు.

సీఎం ఆమోదించిన నివేదికల ఆధారంగానే బదిలీలు, పోస్టింగ్‌లు ఉంటాయని సీఎస్‌ వివరించారు. కేంద్ర సర్వీసులకు వెళ్లడానికి అఖిల భారత సర్వీస్‌ అధికారులకు అవకాశం ఉన్నట్లు ఆదిత్యనాథ్ దాస్ స్పష్టం చేశారు.   

click me!