ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసు: చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ

By narsimha lode  |  First Published Oct 12, 2023, 10:39 AM IST

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ చీఫ్ చంద్రబాబు తరపు న్యాయవాదులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో ఇవాళ  విచారణ జరగనుంది.


అమరావతి: ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో  టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు ఏపీ హైకోర్టులో  బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై గురువారంనాడు ఏపీ హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది.

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో  చంద్రబాబు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ ను ఏసీబీ కోర్టు ఈ నెల 9వ తేదీన కొట్టివేసింది.  గత నెల  14న ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై ఇరు వర్గాల వాదనలను ఏసీబీ కోర్టు విన్నది. ఈ నెల  9వ తేదీన  తీర్పును వెల్లడించనున్నట్టుగా తెలిపింది.  ఈ నెల  9వ తేదీన  చంద్రబాబు బెయిల్ పిటిషన్ ను ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది.  మరో వైపు చంద్రబాబును మరో ఐదు రోజుల పాటు  కస్టడీకి ఇవ్వాలని  సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ ను కూడ  ఏసీబీ కోర్టు ఈ నెల  9వ తేదీన  కొట్టివేసిన విషయం తెలిసిందే.

Latest Videos

undefined

also read:చంద్రబాబుకు షాక్: రైట్ టూ ఆడియెన్స్ పిటిషన్లు డిస్మిస్ చేసిన ఏసీబీ కోర్టు

బెయిల్ పిటిషన్ ను  ఏసీబీ కోర్టు డిస్మిస్ చేయడంతో  ఏపీ హైకోర్టును చంద్రబాబు తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది.  మరో వైపు అంగళ్లు కేసులో చంద్రబాబు తరపు న్యాయవాదులు  ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో నిన్న  పిటిషన్ దాఖలు చేశారు.ఈ కేసులో ఇవాళ్టి వరకు  చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని  ఏపీ హైకోర్టు సీఐడీని ఆదేశించింది.  అయితే  ఈ పిటిషన్ పై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. అంగళ్లు కేసులో  పలువురు టీడీపీ నేతలకు ముందస్తు బెయిల్ తో పాటు, రెగ్యులర్ బెయిళ్లు కూడ లభించాయి.

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ చీఫ్ చంద్రబాబును  ఏపీ సీఐడీ అధికారులు  ఈ ఏడాది సెప్టెంబర్ 9న అరెస్ట్ చేశారు.  ఈ కేసులో  చంద్రబాబుకు ఏసీబీ కోర్టు జ్యుడీషీయల్ రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే  ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని, రిమాండ్ ను రద్దు చేయాలని చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తే  సుప్రీంకోర్టులో చంద్రబాబు ఎస్‌ఎల్‌పీ దాఖలు చేశారు.  ఈ పిటిషన్ పై విచారణ ఈ నెల  13కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు.
 

click me!