ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు: నేడు మధ్యాహ్నం తీర్పు ,అందరిచూపు హైకోర్టు వైపే

By narsimha lode  |  First Published Apr 7, 2021, 1:09 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ పై బుధవారం నాడు మధ్యాహ్నం 2:15 గంటలకు  హైకోర్టు తీర్పు వెలువరించనుంది.



అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ పై బుధవారం నాడు మధ్యాహ్నం 2:15 గంటలకు  హైకోర్టు తీర్పు వెలువరించనుంది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ పై బుధవారం నాడు ఏపీ హైకోర్టులో విచారణ ప్రారంభమైంది.

ఇవాళ ఉదయం విచారణ ప్రారంభం కాగానే ఎస్ఈసీ తరపున  న్యాయవాది సీవీ మోహన్ వాదనలు విన్పించారు.  ఎస్ఈసీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రమణ్యం వాదించారు.టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తరపున న్యాయవాది వేదుల వెంకటరమణ వాదించారు.

Latest Videos

ఉదయం పదకొండు గంటలకు ఎస్ఈసీ వాదనలు విన్న హైకోర్టు.. ఆ తర్వాత వర్ల రామయ్య తరపున న్యాయవాది వాదనలను విన్నారు.ఎస్ఈసీ వాదనలపై తొలుత ఏపీ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. సరైన సమాచారం అందించలేదని హైకోర్టు అభిప్రాయపడింది.
 

click me!