సుప్రీంకోర్టు ఆదేశాలు ఎందుకు పాటించలేదు: ఎస్ఈసీని ప్రశ్నించిన హైకోర్టు, విచారణ వాయిదా

By narsimha lode  |  First Published Apr 7, 2021, 11:49 AM IST

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం దాఖలు చేసిన పిటిషన్ పై  విచారణను  హైకోర్టు డివిజన్ బెంచ్ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేసింది.


హైదరాబాద్: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం దాఖలు చేసిన పిటిషన్ పై  విచారణను  హైకోర్టు డివిజన్ బెంచ్ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేసింది.ఈ ఎన్నికల నిర్వహణపై స్టే విధిస్తూ ఏపీ హైకోర్టు సింగిల్ జడ్జి ఈ నెల 6వ తేదీన ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. 

also read:పరిషత్ ఎన్నికలు: ఏపీ హైకోర్టులో వాదనలు ప్రారంభం, పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది

Latest Videos

ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ ఏపీ ఎన్నికల సంఘం మంగళవారం నాడు  హైకోర్టు డివిజన్ బెంచ్ లో  హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.ఈ పిటిషన్ పై విచారణను ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణకు స్వీకరించింది. బుధవారం నాడు విచారణ ప్రారంభించింది.

ఎస్ఈసీ తరపున వాదనలు విన్న డివిజన్ బెంచ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు నిబంధనలను ఎందుకు పాటించలేదని ప్రశ్నించింది. ఎన్నికల విచారణకు ఎస్ఈసీ సరైన వివరాలు అందించలేదని ధర్మాసనం అభిప్రాయపడింది. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ పత్రాలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది.

click me!