అర్హత ఉన్న ఆయుష్ డాక్టర్లకు ఎందుకు అవకాశం ఇవ్వలేదు: జగన్ సర్కార్ కు ఏపీ హైకోర్టు ఝలక్

By narsimha lodeFirst Published Sep 5, 2022, 7:41 PM IST
Highlights

మిడ్ డే లెవల్ హెల్త్ పోస్టులపై ఏపీ హైకోర్టులో సోమవారం నాడు విచారణ జరిగింది. రేపు మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడ్ పరిక్షలపై హైకోర్టు గతంలోనే స్టే ఇచ్చింది. అర్హత ఉన్న ఆయుష్ డాక్టర్లకు  ఈ పరీక్షలకు అనుమతివ్వకపోవడాన్ని  ఉన్నత న్యాయస్థానం తప్పు బట్టింది. 

అమరావతి: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఝలక్ ఇచ్చింది. మిడ్ డే లెవల్ హెల్త్ పోస్టులపై ఏపీ హైకోర్టులో సోమవారం నాడు విచారణ జరిగింది. అర్హత ఉన్న ఆయుష్ డాక్టర్లకు మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడ్స్ పరీక్షకు గతంలో ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఈ విషయమై డాక్టర్ శివకృష్ణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడ్ పరీక్షల నిర్వహణపై గతంలో  ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది. రేపు మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడ్ పరిక్షలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది.  అర్హత ఉన్న ఆయుష్ డాక్టర్లకు అనుమతి నిరాకరించడంతో  4 వేల మంది డాక్టర్లు నష్టపోతారని పిటిషనర్ తరపు న్యాయవాది  శ్రవణ్ కుమార్ వాదించారు. అర్హత ఉన్న ఆయుష్ డాక్టర్లకు అవకాశం కల్పించాలన్న పిటిషనర్ తరపు న్యాయవాది వాదనతో హైకోర్టు ఏకీభవించింది. 

ఇదిలా ఉంటే  పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. ఈ పరీక్షలు రాసేందుకు గాను 12 వేల మంది ధరఖాస్తు చేసుకున్నారన్నారు. పరీక్షలు నిర్వహించకపోతే  రూ. 65 లక్షల ప్రజాధనం దుర్వినియోగమయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం తరపు న్యాయవాది చెప్పారు.  అర్హత ఉన్న ఆయుష్ డాక్టర్లకు ఎందకు అనుమతించలేదని హైకోర్టు ప్రశ్నించింది. ఎలా పడితే అలా నోటిఫికేషన్ ఇస్తారా అని హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వ చర్యలు ప్రజల ప్రాథమిక  హక్కులు రెండు సమానమేనని హైకోర్టు తెలిపింది. చట్టప్రకారం వెళ్లాల్సిన బాధ్యత ఉందని న్యాయస్థానం ప్రకటించింది. ఈనెల 9 న తుది విచారణ  చేపడతామన్న హైకోర్టు తెలిపింది.

click me!