ఉపాధ్యాయులను చంద్రబాబు రెచ్చగొడుతున్నారు: ఏపీ మంత్రి బొత్స ఫైర్

By narsimha lode  |  First Published Sep 5, 2022, 7:19 PM IST

ప్రతి విషయాన్ని రాజకీయం కోసం ఉపయోగించుకోవడమే చంద్రబాబు పని అని ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఉపాధ్యాయులను చంద్రబాబురెచ్చగొడుతున్నారన్నారు.


అమరావతి:ఉపాధ్యాయులని చంద్రబాబు రెచ్చగొడుతున్నారని ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. సోమవారం నాడు అమరావతిలో ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ  మీడియాతో మాట్లాడారు.. ఉపాధ్యాయు దినోత్సవం అంటే పండగ రోజు అని బొత్స సత్యనారాయణ చెప్పారు. ఉపాధ్యాయు దినోత్సవం రోజున టీడీపీ నేతలు రాజకీయ ఉపన్యాసాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబుకి సమయం సందర్భం ఏమి పట్టనట్లు ఉన్నాయన్నారు..

చంద్రబాబు బతుకంత ఒంటి నిండా రాజకీయమే అని మంత్రి  చెప్పారు. చంద్రబాబుకు అసలు మానవత్వమే లేదని మంత్రి విమర్శించారు. చంద్రబాబు కి ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచిన రోజు అంటే మక్కువన్నారని మంత్రి సెటైర్లు వేశారు. .

Latest Videos

undefined

ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి సమయంలో చంద్రబాబు కి సన్నిహితంగా ఉన్న యనమల లాంటి వాళ్ళు చంద్రబాబు కి రాజకీయ గురువులు అని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. 
ఉపాధ్యాయులని చంద్రబాబు రెచ్చగొడుతున్నారన్నారు. ఈ రకమైన పద్దతి మంచిది కాదని మంత్రి అభిప్రాయపడ్డారు. చంద్రబాబు లాంటి వ్యక్తి ప్రతిపక్ష నేతగా ఉండటం మన కర్మ అని మంత్రి తెలిపారు. 
ఉద్యోగులకు GPS, OPS ఏది మంచిదో ఆలోచన చేస్తున్నామన్నారు. 

 ప్రజల్లో టీడీపీ పని అయిపోయింది అని చంద్రబాబు కి తెలుసునన్నారు. అందుకే చంద్రబాబు మాటల్లో అసహనం కనిపిస్తుందని చెప్పారు. ఉపాధ్యాయులు వాళ్ళని వాళ్ళు గౌరవించుకునే రోజే టీచర్స్ డే  అని మంత్రి గుర్తు చేశారు. టీచర్లను ప్రభుత్వం వాళ్ళని గౌరవిస్తుందన్నారు. కొన్ని ఉపాధ్యాయ సంఘాలు టీచర్స్ డే ను బహిష్కరించిన విషయాన్ని మంత్రిఈ సందర్భంగా ప్రస్తావించారు.
 

click me!