ఆదేశాలు బేఖాతరు.. టీటీడీ ఈవోపై హైకోర్టు ఆగ్రహం, ఈ నెల 27 వరకు డెడ్‌లైన్, లేకుంటే శిక్ష

By Siva KodatiFirst Published Dec 13, 2022, 7:46 PM IST
Highlights

తమ ఆదేశాలు అమలు చేయకపోవడంపై టీటీడీ ఈవో ధర్మారెడ్డిపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 27 లోపు ఆదేశాలు అమలు చేయకుంటే శిక్ష విధిస్తామని ధర్మాసనం హెచ్చరించింది. 

తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డిపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ముగ్గురు కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై హైకోర్టు డివిజన్ బెంచ్ అప్పీల్‌కు వెళ్లింది టీటీడీ. అయితే కోర్టు ఉత్తర్వులు అమలు చేయలేదని టీటీడీ ఈవోకి శిక్ష విధించింది న్యాయస్థానం. గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఈ నెల 27వ తేదీ లోపు అమలు చేయకుంటే శిక్ష విధిస్తామని ధర్మాసనం హెచ్చరించింది. ఉద్యోగుల క్రమబద్ధీకరణపై గతంలో సింగిల్ బెంచ్ ఉత్వర్వులపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. ఈ నేపథ్యంలో బుధవారం సింగిల్‌ బెంచ్ ఉత్తర్వులపై అప్పీల్‌కు వెళ్లనుంది టీటీడీ. 

ALso REad:సిఫారసు లేఖలతో శ్రీవారి వీఐపీ బ్రేక్ టికెట్లు.. బ్లాక్‌లో విక్రయం, విజిలెన్స్‌ వలలో ఎండోమెంట్ ఉద్యోగి

ఇకపోతే.. టికెట్లు వున్న భక్తులకే తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని చెప్పింది టీటీడీ . మొత్తం ఏడున్నర లక్షల మందికి అవకాశం వుంటుందని వెల్లడించింది. పదిరోజుల పాటు శ్రీవారి ఆర్జిత సేవలు ఏకాంతంగా నిర్వహిస్తామని తెలిపింది. జనవరి 2 నుంచి 11 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు వుంటాయని స్పష్టం చేసింది. రోజుకు 25 వేల చొప్పున రూ.300 ప్రత్యేక ప్రవేశ టికెట్లు జారీ చేస్తామని.. తిరుపతిలోని 9 ప్రాంతాల్లో రోజుకు 50 వేల చొప్పున సర్వ దర్శన టికెట్లు జారీ చేస్తామని వెల్లడించింది. శ్రీవారి ట్రస్ట్ దాతలకు ఆన్‌లైన్ ద్వారా టికెట్లు జారీ చేస్తామని.. మహాలఘు ద్వారానే అందరికీ స్వామివారి దర్శనం కల్పిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. అలాగే డిసెంబర్ 29 నుంచి జనవరి 3 వరకు తిరుమలలో అడ్వాన్స్ గదుల బుకింగ్‌ను నిలిపివేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. భక్తులకు సీఆర్‌వో వద్దనే గదులు కేటాయిస్తామని ధర్మారెడ్డి పేర్కొన్నారు
 

click me!