ఏ కేసులు లేవు... ఆ స్థాయిలో బలగాలెందుకు, అయ్యన్నకు ఊరట: పోలీస్ శాఖపై హైకోర్టు ఆగ్రహం

By Siva KodatiFirst Published Jul 1, 2022, 9:29 PM IST
Highlights

తన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారంటూ టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు దాఖలు చేసిన పిటిషన్ పై శుక్రవారం ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా పోలీస్ శాఖపై ధర్మాసనం మండిపడింది. 

టీడీపీ (tdp) సీనియర్ నేత , మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడికి (ayyanna patrudu) హైకోర్టులో (ap high court) ఊరట లభించింది. ఆయన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించరాదంటూ శుక్రవారం రాష్ట్ర పోలీస్ శాఖకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అకారణంగా తన ఇంటి వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించడంతో పాటు తన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారంటూ అయ్యన్నపాత్రుడు ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం విచారణ చేపట్టిన హైకోర్టు.. పోలీస్ శాఖపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనపై ఎలాంటి కేసులు లేకపోయినా అయ్యన్నపాత్రుడి ఇంటి వద్ద బలగాల మోహరింపు ఎందుకని ప్రశ్నించింది. 

కాగా.. ఇటీవల నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడు ఇంటి ప్రహరీ గోడ కూల్చివేత తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత తొలిసారిగా ట్విట్టర్ వేదికగా స్పందించిన అయ్యన్నపాత్రుడు.. వైసీపీ (ysrcp) రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై (vijayasai reddy) విమర్శలు చేశారు. తనను ఎదుర్కోవడానికి రాష్ట్ర అధికార యంత్రాంగం అంతా నర్సీపట్నంలోనే ఉందన్నారు. ‘‘జేసీబీలు, ఐపీఎస్‌లు, ఆర్డీవోలు, వందల సంఖ్యలో పోలీసులు, పదుల సంఖ్యలో పోలీసు వాహనాలు, సోషల్ మీడియా కేసులు. అంత భయం ఎందుకు సాయి రెడ్డి? దమ్ముంటే నేరుగా నువ్వే నర్సీపట్నం వచ్చేయ్ తేల్చుకుందాం’’ అని ట్విట్టర్ వేదికగా సవాలు విసిరారు. 

Also REad:నేను నర్సీపట్నంలోనే ఉన్నా.. అప్పుడు ఎవరు పులో తెలిపోతుంది: విజయసాయిరెడ్డికి అయ్యన్నపాత్రుడు సవాలు

ఇక, తాజాగా విజయసాయి రెడ్డిపై అయ్యన్నపాత్రుడు మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘16 నెలలు చిప్పకూడు తినడం వలన శరీరం మందపడింది. తోటి ఖైదీలు, ఖాకీల చేతిలో తిన్న దెబ్బల వలన ఏర్పడ్డ చారలు చూసుకొని విజయ సాయి రెడ్డి పులి గా ఫీల్ అవ్వడంలో తప్పు లేదు. బెయిల్ కోసం ప్రత్యేక హోదా తాకట్టు పెట్టడానికి ఢిల్లీ వెళ్లిన నువ్వు నన్ను అజ్ఞాతంలో ఉన్నావనడం విడ్డూరంగా ఉంది. అంత గొప్పగా ఉంది నీ ప్రభుత్వ సమాచార వ్యవస్థ. నేను నర్సీపట్నంలోనే ఉన్నా. ముహూర్తం ఎందుకు నువ్వు ఎప్పుడొచ్చినా నేను రెఢీ. అన్నట్టు పులి అయితే పోలీసుల్ని వేసుకొని రాదుగా సింగిల్ గా రావాలి. అప్పుడు తేలిపొద్ది ఎవడు పులో ఎవడు పిల్లో!’’ అని అయ్యన్నపాత్రుడు ట్వీట్ చేశారు. 
 

click me!