ఎస్ఈసీ‌గా నీలం సహానీ: పిటిషనర్‌పై ఏపీ హైకోర్టు ఆగ్రహం

By narsimha lode  |  First Published Jun 16, 2021, 2:10 PM IST

సమగ్ర సమాచారం లేకుండా  'పిల్' వేసిన పిటిషనర్ పై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆంధప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా నీలం సహానీ నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన 'పిల్‌'పై పై ఏపీ హైకోర్టు బుధవారం నాడు విచారణ నిర్వహించింది. 


అమరావతి: సమగ్ర సమాచారం లేకుండా  'పిల్' వేసిన పిటిషనర్ పై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆంధప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా నీలం సహానీ నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన 'పిల్‌'పై పై ఏపీ హైకోర్టు బుధవారం నాడు విచారణ నిర్వహించింది. 

ఏపీ రాష్ట్ర ఎస్ఈసీ నియామకం కోసం రాష్ట్ర ప్రభుత్వం సూచించిన ముగ్గురి పేర్లు రాజ్యాంగ విరుద్దమని పిటిషనర్ కోరారు. నీలం సహానీని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా  నియమిస్తూ ఇచ్చిన జీవోను రద్దు చేయాలని పిటిషనర్ కోరారు. పూర్తి సమాచారం లేకుండా ఎలా పిల్ వేస్తారని హైకోర్టు పిటిషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసు విచారణ వచ్చేవారానికి వాయిదా వేసింది. 

Latest Videos


ఏపీ ఎస్ఈసీగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ పదవీ విరమణ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురి పేర్లను గవర్నర్ కు సిఫారసు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ సలహదారుగా ఉన్న నీలం సహానీ పేరును ఎస్ఈసీగా గవర్నర్ ఆమోదం తెలిపారు. దీంతో ఏపీ ఎస్ఈగా నీలం సహనీ కొనసాగుతున్నారు. 

click me!