రాజధాని నిర్మాణాలపై వ్యయం: అకౌంటెంట్ జనరల్‌పై ఏపీ హైకోర్టు సీరియస్ వ్యాఖ్యలు

By narsimha lodeFirst Published Nov 23, 2020, 9:33 PM IST
Highlights

రాజధాని నిర్మాణాలపై అకౌంటెంట్ జనరల్ నివేదిక ఇవ్వకపోవడంపై ఏపీ హైకోర్టు సీరియస్ వ్యాఖ్యలు చేసింది.


అమరావతి: రాజధాని నిర్మాణాలపై అకౌంటెంట్ జనరల్ నివేదిక ఇవ్వకపోవడంపై ఏపీ హైకోర్టు సీరియస్ వ్యాఖ్యలు చేసింది.

సోమవారం నాడు రాజధానిపై దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టు విచారించింది. రాజధానిలో చేపట్టిన నిర్మాణాలపై ఎంత ఖర్చు చేశారనే విషయమై ఎందుకు నివేదికలు ఇవ్వలేదని హైకోర్టు ప్రశ్నించింది.

వచ్చే సోమవారం వరకు నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. నివేదిక ఇవ్వకపోతే అకౌంటెంట్ జనరల్ కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుందని కోర్టు ఆదేశించింది.

జీఎస్ రావు, బోస్టన్ కమిటీ, హైపవర్ కమిటీ నివేదికల్లో సీఆర్‌డీఏ చట్టాన్ని రద్దు చేయాలని ఎక్కడ ఉందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం హామీలను ఉల్లంఘించిందని రైతుల తరపున లాయర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.ఈ కేసుపై  విచారణను ఏపీ హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. 

ఏపీ రాజదానిపై హైకోర్టు రోజువారీ విచారణ చేస్తోంది. ఏపీ రాజధానిని అమరావతి నుండి తరలించొద్దని రైతులు హైకోర్టులో పిటిషన్లను దాఖలు చేసింది.ఈ పిటిషన్లను కలిపి రోజువారీగా విచారణ చేస్తుంది. ఈ క్రమంలోనే ఇవాళ రాజధాని నిర్మాణంపై ఇవాళ విచారణ సమయంలో కీలక వ్యాఖ్యలు చేసింది.

 

click me!