ఆర్-5 జోన్ లో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి తీర్పును ఏపీ హైకోర్టు రిజర్వ్ చేసింది.
అమరావతి: ఆర్-5 జోన్ ఇళ్ల నిర్మాణంపై వాదనలు ముగిశాయి. తీర్పును ఏపీ హైకోర్టు రిజర్వ్ చేసింది.ఆర్-5 జోన్ ఇళ్ల నిర్మాణంపై ఏపీ హైకోర్టులో శుక్రవారంనాడు విచారణ నిర్వహించింది. ఏపీ ప్రభుత్వం.పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అమరావతిలో ఆర్ -5 జోన్ ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై రిట్ పిటిషన్ ఏపీ హైకోర్టులో దాఖలైంది.ఈ పిటిషన్ పై ఈ నెల 17 న హైకోర్టు విచారణ చేపట్టింది.
ఆర్-5 జోన్ లో ఇళ్లు కట్టుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాల్లో ఉందా అని హైకోర్టు ప్రశ్నించింది. తుది తీర్పునకు లోబడి ఇళ్ల నిర్మాణం ఉంటుందని ప్రభుత్వ తరపు న్యాయవాది వ్యాఖ్యలను హైకోర్టు ప్రస్తావించింది. సుప్రీంకోర్టు తుది తీర్పు ఇళ్ల నిర్మాణానికి వ్యతిరేకంగా తీర్పు వస్తే ఖర్చు చేసిన డబ్బులు వృధా అవుతాయని ఏపీ హైకోర్టు ప్రశ్నించింది.
ఆర్-5 జోన్ లో ఇళ్ల నిర్మాణానికి అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలోని 53,216 మంది పేదలకు ఆర్-5 జోన్ లో ఇళ్ల స్థలాలు కేటాయించారు. ఇళ్ల స్థలాలతో పాటు ఇళ్లను నిర్మించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఈ నెల 24వ తేదీన ఇళ్ల నిర్మాణ పనులను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. సీఎం జగన్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఇతర ప్రాంతాలకు చెందిన 47, 107 మందికి ఆర్-5 జోన్ లో బయటి ప్రాంతాలకు చెందిన వారికి ఇళ్లు నిర్మించనున్నారు. ఇప్పటికే పట్టాల పంపిణీ చేశారు.