అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్‌పై ముగిసిన వాదనలు: తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు

Published : Aug 25, 2020, 04:57 PM IST
అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్‌పై ముగిసిన వాదనలు: తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు

సారాంశం

మాజీ మంత్రి అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్ పై తీర్పును ఏపీ హైకోర్టు రిజర్వ్ చేసింది. వచ్చే శుక్రవారం నాడు తీర్పును వెల్లడించనుంది.

అమరావతి: మాజీ మంత్రి అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్ పై తీర్పును ఏపీ హైకోర్టు రిజర్వ్ చేసింది. వచ్చే శుక్రవారం నాడు తీర్పును వెల్లడించనుంది.

ఈఎస్ఐ కుంభకోణం కేసులో మాజీ మంత్రి అచ్చెన్నాయుడును ఏసీబీ అరెస్ట్ చేసింది.  కరోనా సోకిన నేపథ్యంలో అచ్చెన్నాయుడును కోర్టు ఆదేశాల మేరకు ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలించారు.

ఏపీ హైకోర్టులో బెయిల్ పిటిషన్లపై వాదనలు ముగిశాయి. అయితే బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. బెయిల్ పై వచ్చే శుక్రవారం నాడు తీర్పును వెల్లడించనున్నట్టుగా కోర్టు తెలిపింది.

ఈఎస్ఐ కుంభకోణంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడును ఏసీబీ అధికారులు ఈ ఏడాది జూన్ 12వ తేదీన అరెస్ట్ చేశారు. ఈఎస్ఐ స్కాంలో విజిలెన్స్ నివేదిక ఆధారంగా రూ. 150 కోట్ల కుంభకోణంలో అచ్చెన్నాయుడు పాత్ర ఉన్నట్టుగా ఏసీబీ అధికారులు ప్రకటించారు. 

ఈ కేసులో ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేశారు. ఇంకా 7 మందికి సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నారు.ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేస్తున్నామని ఏసీబీ అధికారులు ప్రకటించారు. సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున బెయిల్ ఇవ్వకూడదని ఏసీబీ తరపున న్యాయవాదులు కోర్టును కోరుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్