స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం.. చంద్రబాబు రిమాండ్ రివ్యూ పిటిషన్‌పై ముగిసిన వాదనలు, తీర్పు రిజర్వ్

Siva Kodati |  
Published : Sep 19, 2023, 06:22 PM IST
స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం.. చంద్రబాబు రిమాండ్ రివ్యూ పిటిషన్‌పై ముగిసిన వాదనలు, తీర్పు రిజర్వ్

సారాంశం

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబు రిమాండ్ రివ్యూ పిటిషన్‌పై ఏపీ హైకోర్ట్‌లో వాదనలు ముగిశాయి. ఈ సందర్భంగా న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది . 

టీడీపీ అధినేత చంద్రబాబుపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబు రిమాండ్ రివ్యూ పిటిషన్‌పై ఏపీ హైకోర్ట్‌లో వాదనలు ముగిశాయి. ఈ సందర్భంగా తీర్పును రిజర్వ్ చేసింది ఏపీ హైకోర్ట్. అటు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఈ నెల 21న హైకోర్టులో వాదనలు జరగనున్నాయి. రేపు ఏసీబీ కోర్టులో పోలీస్ కస్టడీ, మధ్యంతర బెయిల్‌పై వాదనలు జరగనున్నాయి. ఇవి కాక తాజాగా ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుపై పీటీ వారెంట్ దాఖలైంది. ఆయనపై ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది సీఐడీ. నిబంధనలకు విరుద్ధంగా టెరాసాఫ్ట్ కంపెనీకి ఫైబర్ నెట్ కాంట్రాక్ట్ ఇచ్చారని సీఐడీ ఆరోపిస్తోంది. 

ఇదిలావుండగా.. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన  క్వాష్ పిటిషన్ పై తీర్పును ఏపీ హైకోర్టు మంగళవారం నాడు రిజర్వ్ చేసింది. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని, రిమాండ్ ను రద్దు చేయాలని  కోరుతూ చంద్రబాబు నాయుడు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై  ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుండి వాదనలు జరిగాయి. చంద్రబాబు తరపున  సుప్రీంకోర్ట్ సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే , సిద్దార్థ్ లూథ్రాలు  వాదించారు.

ALso Read: చంద్రబాబుకు మరో షాక్.. ఫైబర్‌నెట్ కేసులో పీటీ వారెంట్ దాఖలు చేసిన సీఐడీ

ఏపీ సీఐడీ తరపున  ముకుల్ రోహత్గీ  వాదించారు. చంద్రబాబు  అరెస్ట్ ప్రక్రియ నిబంధనలకు విరుద్దంగా జరిగిందని  ఆయన తరపు న్యాయవాదులు వాదించారు.  కానీ ఈ వాదనలను ఏపీ సీఐడీ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ తోసిపుచ్చారు. అన్ని సాక్ష్యాలను సేకరించిన తర్వాతే  చంద్రబాబును అరెస్ట్ చేసినట్టుగా రోహత్గీ చెప్పారు

PREV
click me!

Recommended Stories

Raghurama Krishnam Raju: కోడిపందాలను ప్రారంభించిన ఏపీ డిప్యూటీ స్పీకర్ RRR | Asianet News Telugu
RK Roja Bhogi Lecebrations With Family: భోగి రోజు రంగురంగు ముగ్గులు వేసిన రోజా| Asianet News Telugu