టీడీపీ ఎమ్మెల్సీ ఆశోక్‌బాబుకు షాక్: మధ్యంతర బెయిల్ కి హైకోర్టు నిరాకరణ

Published : Feb 11, 2022, 04:00 PM ISTUpdated : Feb 11, 2022, 04:12 PM IST
టీడీపీ ఎమ్మెల్సీ ఆశోక్‌బాబుకు షాక్: మధ్యంతర బెయిల్ కి హైకోర్టు నిరాకరణ

సారాంశం

టీడీపీ ఎమ్మెల్సీ ఆశోక్ బాబుకి ఏపీ హైకోర్టులో నిరాశే ఎదురైంది.  మధ్యంతర బెయిల్ ను హైకోర్టు నిరాకరించింది. కేసు విచారణను సోమవారానికి వాయిదా వేసింది. 


అమరావతి: TDP  ఎమ్మెల్సీ Ashok Babu కు మధ్యంతర Bail ఇవ్వడానికి AP High Court శుక్రవారం నాడు నిరాకరించింది. ఆశోక్ బాబుకు మధ్యంతర బెయిలివ్వాలని కోరుతూ ఆయన తరపున న్యాయవాది ఇవాళ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ ను దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని కూడా సీఐడీని ఏపీ హైకోర్టు ఆదేశించింది. అంతేకాదు లోకాయుక్తను కూడా ఈ కేసులో పార్టీగా చేర్చాలని కూడా హైకోర్టు కోరింది.

టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబును సీఐడీ పోలీసులు గురువారం నాడు రాత్రి అరెస్టు చేశారు. పదోన్నతి కోసం నకిలీ విద్యార్హతలను చూపించారన్న ఆరోపణలపై ఆయనను  విజయవాడలో అరెస్ట్ చేశారు. అశోక్‌బాబు వాణిజ్య పన్నుల శాఖలో ACTOగా పని చేసి రిటైర్‌ అయ్యారు. అయితే Degree చదవకుండానే చదివినట్లుగా చూపించారని ఉమ్మడి రాష్ట్రంలోనే ఆయనపై ఆరోపణలు వచ్చాయి.  దీనిపై ఉమ్మడి రాష్ట్రంలోనే శాఖాపరమైన విచారణ జరిగింది.  తాను ఎలాంటి తప్పు చేయలేదని అశోక్‌బాబు అప్పట్లో వివరణ ఇచ్చారు.దీనిపై విజిలెన్స్‌ అధికారులు కూడా విచారణ జరిపి. ఆయనపై అభియోగాలను ఉపసంహరించారు.  అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి హయాంలోనే ఈ కేసు ను మూసివేశారు.

 అశోక్‌బాబు ఏపీ ఎన్జీవో నేతగా, సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో జేఏసీ అధ్యక్షుడిగా కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయనకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది.  తాజాగా PRCపై రగడ రగులుతున్న సమయంలోనే అశోక్‌బాబుపై వైసీపీ ప్రభుత్వం మరోమారు పాత ఆరోపణలను బయటికి తీసింది. తమకు అందిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీఐడీకి లోకాయుక్త సూచించింది. దీంతో సీఐడీ వెంటనే కేసు నమోదు చేశారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్