ఈ నెల 21వరకు ఇంట్లోనే ఉండాలని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇచ్చిన ఆదేశాలను ఏపీ హైకోర్టు ఆదివారం నాడు కొట్టేసింది.
అమరావతి: ఈ నెల 21వరకు ఇంట్లోనే ఉండాలని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇచ్చిన ఆదేశాలను ఏపీ హైకోర్టు ఆదివారం నాడు కొట్టేసింది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఈ నెల 21వ తేదీ వరకు ఇంటి నుండి బయటకు రావొద్దని ఎస్ఈసీ ఆదేశించింది.
also read:నిమ్మగడ్డకు షాక్: మంత్రి పెద్దిరెడ్డిపై ఎస్ఈసీ ఆదేశాలను కొట్టేసిన ఏపీ హైకోర్టు
ఎస్ఈసీ ఆదేశాలను పాటిస్తానని శనివారం నాడు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. అదే సమయంలో ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో ఇవాళ విచారణ నిర్వహించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ టూర్ లో పాల్గొనేందుకు గాను ఏపీ హైకోర్టు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అనుమతి ఇచ్చింది. ఇరువర్గాల వాదనలను విన్న ఉన్నత న్యాయస్థానం ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలను కొట్టేసింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హౌస్ అరెస్ట్ ఆదేశాలు చెల్లవని హైకోర్టు స్పష్టం చేసింది.మరోవైపు మీడియాతో మాట్లాడే సమయంలో ఎస్ఈసీ ఇచ్చే ఆదేశాలను పాటించాలని హైకోర్టు సూచించింది.