గ్రూప్-1 పరీక్షలకు లైన్‌క్లియర్: పిటిషన్ కొట్టేసిన ఏపీ హైకోర్టు

Published : Dec 09, 2020, 01:21 PM IST
గ్రూప్-1 పరీక్షలకు లైన్‌క్లియర్: పిటిషన్ కొట్టేసిన ఏపీ హైకోర్టు

సారాంశం

గ్రూప్-1  పరీక్షలపై దాఖలైన పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది.దీంతో పరీక్షలను షెడ్యూల్ ప్రకారంగా నిర్వహించేందుకు మార్గం సుగమమైంది.  

అమరావతి:  గ్రూప్-1  పరీక్షలపై దాఖలైన పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది.దీంతో పరీక్షలను షెడ్యూల్ ప్రకారంగా నిర్వహించేందుకు మార్గం సుగమమైంది.

గ్రూప్-1 పరీక్షలపై దాఖలైన పిటిషన్ పై మంగళవారం నాడు ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. గ్రూప్-1 పరీక్షలను షెడ్యూల్  ప్రకారంగానే నిర్వహించాలని  ఏపీ  హైకోర్టు ఆదేశించింది.

ఈ నెల 14వ తేదీన పరీక్షలు నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారంగానే ఈ పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ పరీక్షలు వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.

దీంతో పరీక్షల నిర్వహణకు మార్గం సుగమమైంది.  గ్రూప్-1   ప్రిలిమినరీ పరీక్షలు గత ఏడాది మే 26వ తేదీన నిర్వహించారు. మెయిన్స్ పరీక్షలను ఈ నెలలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

కరోనా నేపథ్యంలో ఈ పరీక్షలను గతంలో నిర్వహించాల్సి ఉండగా వాయిదా వేశారు. చివరికి నవంబర్ మాసంలో నిర్వహించాలని నిర్ణయం తీసుకొన్నారు.

PREV
click me!

Recommended Stories

Minister Nara Lokesh: మంత్రి లోకేష్ నే ర్యాగింగ్ చేసిన విద్యార్థి అందరూ షాక్| Asianet Telugu
Lokesh Interaction with Students: లోకేష్ స్పీచ్ కిదద్దరిల్లిన సభ | Asianet News Telugu