ఆత్మహత్యే మాకు శరణం.. కాల్ మనీ బాధితుల ఆవేదన

By telugu news teamFirst Published Dec 9, 2020, 12:26 PM IST
Highlights

ఇంటి పైకి వచ్చి మరీ దాడి చేస్తున్నారని అయినా వారిపై చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాల్ మనీ గ్యాంగ్ నుంచి తమకు రక్షణ కల్పించాలంటూ వేడుకుంటున్నారు.

కాల్ మనీ గ్యాంగ్ తమను తవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందంటూ తాడిపల్లికి చెందిన  ఓ కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. తీసుకున్న రూ.2లక్షల అప్పుకి రూ.14లక్షలు వసూలు చేస్తున్నారని వారు వాపోయారు. తమకు కాల్ మనీ గ్యాంగ్ నుంచి ప్రాణ హాని ఉందంటూ వారు వాపోయారు. ఈ విషయంలో తాము పోలీసులను ఆశ్రయించినప్పటికీ ఎలాంటి ఫలితం దక్కలేదన్నారు.

ఇంటి పైకి వచ్చి మరీ దాడి చేస్తున్నారని అయినా వారిపై చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాల్ మనీ గ్యాంగ్ నుంచి తమకు రక్షణ కల్పించాలంటూ వేడుకుంటున్నారు.  న్యాయం చేయాలంటూ అధికారులను వేడుకుంటున్నారు. బాధితులను శిక్షించి తమకు న్యాయం చేయకపోతే తాము ఆత్మహత్య చేసుకుంటామని.. అంతకుమించి తమకు వేరే దారి ఏదీ లేదంటూ కన్నీరు పెట్టుకున్నారు. 

కాగా.. ఇలాంటి బాధితులు చాలా మంది ఉన్నారని తెలుస్తోంది. ఈ కాల్ మనీ గ్యాంగు ఆగడాలు ఆగడం లేదని పలువురు వాపోతున్నారు. 

click me!