బ్రహ్మంగారి మఠం కేసులో హైకోర్టు షాక్: ఏపీ ప్రభుత్వ ఆదేశాలు కొట్టివేత

By narsimha lodeFirst Published Jul 16, 2021, 11:44 AM IST
Highlights

బ్రహ్మంగారి మఠం వ్యవహరంలో ఏపీ హైకోర్టు శుక్రవారం నాడు కీలక ఆదేశాలు జారీ చేసింది. టీటీడీ ఈవో సంతకం తీర్మానంలో లేదని  హైకోర్టు తెలిపింది. దీంతో  బ్రహ్మంగారి పీఠం మఠాధిపతి వ్యవహరం మళ్లీ మొదటికి వచ్చింది.


అమరావతి: బ్రహ్మంగారి మఠం వ్యవహరంలో ప్రభుత్వ ఆదేశాలను ఏపీ హైకోర్టు కొట్టివేసింది.  ధార్మిక పరిషత్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో సభ్యుడైన టీటీడీ ఈవో సంతకం తీర్మానంలో లేదని హైకోర్టు  తెలిపింది.ధార్మిక పరిషత్ తీర్మానం ప్రకారంగా  మఠం వ్యవహరాలను చూసేందుకు ఏపీ ప్రభుత్వం దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ ను నియమించింది. అయితే ధార్మిక పరిషత్  ఎగ్జిక్యూటివ్ కమిటీలో టీటీడీ ఈవో సభ్యుడిగా ఉన్నాడు. అయితే ధార్మిక పరిషత్ పంపిన తీర్మానంలో ఈవో సంతకం లేదని హైకోర్టు చెప్పింది. దీంతో ప్రభుత్వ ఆదేశాలు కూడ చెల్లవని హైకోర్టు తేల్చి చెప్పింది.

also read:బ్రహ్మంగారి పీఠం మఠాధిపతి నియామకం: హైకోర్టును ఆశ్రయించిన మహాలక్ష్మమ్మ

ధార్మిక పరిషత్ తీర్మానం నిబంధనలకు అనుగుణంగా లేదని హైకోర్టు అభిప్రాయపడింది.పీఠాధిపతి  పదవి ఖాళీ ఏర్పడినప్పుడు  తాత్కాలిక ఏర్పాట్లు చేసే అధికారం ధార్మిక పరిషత్ కు ఉన్న విషయాన్ని హైకోర్టు గుర్తు చేసింది.నిబంధనలకు అనుగుణంగానే పీఠాధిపతి ఎంపిక చేయాల్సి ఉంటుందని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.బ్రహ్మంగారి పీఠం మఠాధిపతిగా వీరభోగ వెంకటేశ్వరస్వామి మొదటి భార్య తనయుడు  వెంకటాద్రిని నియమితులయ్యారు.  కుటుంబసభ్యులమధ్య ఏకాభిప్రాయం మేరకు వెంకటాద్రి నియామకం జరిగింది. 

అయితే తమపై ఒత్తిడి తీసుకొచ్చి ఈ నియామకం జరిగేలా  చేశారని  వీరభోగవెంకటేశ్వరస్వామి రెండో భార్య మహాలక్ష్మమ్మ జూన్ 30న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు తీర్పు ఇటీవల రిజర్వ్ చేసింది.  పీఠాధిపతి నియామకం విషయంలో ఏపీ సర్కార్ ఆదేశాలను శుక్రవారం నాడు ఏపీ హైకోర్టు కొట్టేసింది.

click me!